Dil Raju : నిరాశ ప‌రిచిన థాంక్ యూ మూవీ.. దిల్ రాజుకు భారీ న‌ష్ట‌మే..?

July 23, 2022 6:12 PM

Dil Raju : శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఇందులో నాగ‌చైత‌న్య, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు ఇత‌ర కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా థాంక్ యూ మూవీకి రూ.2.16 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సినిమా నిరాశ ప‌రిచింద‌ని.. దిల్ రాజుకు ఈ మూవీ భారీ న‌ష్టాన్నే క‌లిగించింద‌ని అంటున్నారు.

థాంక్ యూ మూవీకి గాను తొలి రోజు నైజాంలో రూ.72 ల‌క్ష‌లు, సీడెడ్‌లో రూ.20 ల‌క్ష‌లు, గుంటూరు రూ.10 ల‌క్ష‌లు, కృష్ణా రూ.12 ల‌క్ష‌లు, నెల్లూరు రూ.7 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అలాగే తెలంగాణ‌, ఏపీ క‌లిపి తొలి రోజు క‌లెక్ష‌న్లు రూ.1.65 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయి. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా మ‌త్తం రూ.3.70 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. రూ.2.16 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే మూవీ మొత్తం రూ.24 కోట్ల బిజినెస్ చేసింద‌ని చెబుతుండ‌గా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.25 కోట్లు రావాలి. కానీ ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు.

Dil Raju got huge losses with Thank You movie
Dil Raju

తెలంగాణ‌తోపాటు ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో వ‌ర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్ర‌జ‌లు కాలు బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇది సినిమా క‌లెక్ష‌న్ల‌పై బాగానే ప్ర‌భావం చూపిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వ‌ర్షాలు త‌గ్గిన‌ప్ప‌టికీ ఇంకో రెండు మూడు రోజుల త‌రువాత సినిమాను చూసేందుకు పెద్ద‌గా ఆస‌క్తిని చూప‌రు. తొలి రోజే క‌లెక్ష‌న్లు ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో క‌లెక్ష‌న్లు ఇంకా ప‌డిపోతాయ‌ని భావించ‌వ‌చ్చు. అదే జ‌రిగితే బ్రేక్ ఈవెన్ సాధించేందుకు చాలా కాల‌మే ప‌డుతుంది. కానీ అప్ప‌టి వ‌ర‌కు ఓటీటీలోనూ వ‌చ్చేస్తుంది. క‌నుక ఈ మూవీతో మేక‌ర్స్ కు న‌ష్ట‌మే వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే కాస్తంత న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాలంటే సినిమాను ఓటీటీలో కాస్త ముందుగా రిలీజ్ చేయాలి. మ‌రి మేక‌ర్స్ ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now