మంగళవారం, జూన్ 30, 2026
ఆరోగ్యం

Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య…

Dengue Fever : డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, ఎంతకాలం ఉంటుంది.. లక్షణాలు ఏమిటి..?

Dengue Fever : ప్ర‌స్తుత సీజ‌న్‌లో డెంగ్యూ అధికంగా విస్త‌రిస్తోంది. డెంగ్యూ కార‌ణంగా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరం కారణంగా రోగి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతోపాటు శరీరంలో విపరీతమైన నొప్పి, కీళ్ల నొప్పులు, శారీరక బలహీనత, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే డెంగ్యూ వచ్చినప్పుడు ఆ జ్వరం ఎంతకాలం ఉంటుందోనని భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి.

సీడీసీ (వ్యాధి నియంత్రణ మరియు నివారణకు కేంద్రం) వివరాల ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2-7 రోజుల వరకు ఉంటాయి. చాలా మంది 1 వారంలోపు కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన మొదట్లో ఇతర వ్యాధులను సూచిస్తాయి. దీంతో చాలామంది డెంగ్యూ, వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. డెంగ్యూ జ్వరంలో నొప్పి లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇది కాకుండా కంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, వికారం/వాంతులు, కీళ్ల నొప్పులు మొదలైనవి ఉంటాయి.

Dengue Fever signs symptoms how many days it lasts
Dengue Fever

జ్వరం వచ్చినా, డెంగ్యూ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరాన్ని నియంత్రించడానికి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వైద్యుడు సూచించిన యాంటీ బయాటిక్స్ తీసుకోండి. వైద్య సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ద్రవాలు సేవిస్తుండాలి. ఎలక్ట్రోలైట్స్ జోడించిన నీరు లేదా పానీయాలు తాగడం ఉత్తమం. శిశువులు, పిల్లలు లేదా వృద్ధులలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. డెంగ్యూ వచ్చిన వారు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి