గురువారం, జూన్ 11, 2026
భార‌త‌దేశం

మ‌రో 6-8 వారాల్లో కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చే అవ‌కాశం: ఎయిమ్స్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే మ‌రో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్…

మ‌రో 6-8 వారాల్లో కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చే అవ‌కాశం: ఎయిమ్స్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే మ‌రో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండాలంటే నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం చాలా అవ‌స‌రం అని అన్నారు.

covid 3rd wave will come in just 6-8 weeks if we do not follow rules says guleria

టీకాల‌ను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత మంచిద‌ని దీంతో మూడో వేవ్‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌జ‌లు క‌చ్చితంగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల్సిందేన‌ని, లేక‌పోతే మూడో వేవ్ రూపంలో తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంద‌ని హెచ్చ‌రించారు.

కాగా దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఆగ‌స్టు చివ‌రి వ‌ర‌కు వ‌స్తుంద‌ని కొంద‌రు నిపుణులు హెచ్చ‌రిస్తుండ‌గా అది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌స్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఏది ఏమైనా మూడో వేవ్ రాకుండా చూడ‌డం ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంద‌ని చాలా మంది నిపుణులు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి