Chiranjeevi : జ‌ర్న‌లిస్టుకు ఆప‌ద్బాంధ‌వుడిగా మారిన చిరంజీవి.. ఆప‌రేష‌న్‌కు స‌హాయం..

June 21, 2022 2:22 PM

Chiranjeevi : పేద‌ల‌కు, అవ‌స‌రం ఉన్న‌వారికి స‌హాయం చేయ‌డంలో మెగాస్టార్ చిరంజీవి అంద‌రి క‌న్నా ముందే ఉంటారు. ఆయ‌న ఇప్ప‌టికే బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ల పేరిట ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారికి కాదు, లేదు.. అన‌కుండా ఆయ‌న స‌హాయం చేస్తూనే ఉంటారు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న ఓ ట్ర‌స్ట్‌ను పెట్టి పేద సినీ క‌ళాకారుల‌ను ఆదుకున్నారు. అలాగే తోటి న‌టీన‌టులు కూడా స‌హాయం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇక చిరంజీవి అవ‌స‌రం ఉన్న‌వారికి, పేద‌ల‌కు ఎంతో స‌హాయం చేస్తుంటారు. పేద‌ల‌కు ఉచితంగా ఆప‌రేష‌న్ల‌ను చేయిస్తుంటారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న మ‌రోమారు త‌న‌లో ఉన్న దాతృత్వ గుణాన్ని బ‌య‌ట పెట్టారు. ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన ఫొటో జ‌ర్న‌లిస్ట్‌ను ఆయ‌న ఆదుకున్నారు. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే స‌ర్జ‌రీ కోసం అత‌ని వ‌ద్ద కావ‌ల్సినంత డ‌బ్బు లేదు. దీంతో స‌హాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నాడు.

Chiranjeevi helped a journalist for his surgery
Chiranjeevi

అయితే ఈ విష‌యం చిరంజీవికి తెలియ‌గానే వెంట‌నే ఆయ‌న హాస్పిట‌ల్‌కు చేరుకుని డాక్ట‌ర్ల‌తో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడారు. ఆ జ‌ర్న‌లిస్టు ఆప‌రేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని తానే భ‌రిస్తాన‌ని చిరంజీవి హామీ ఇచ్చారు. దీంతో ఆ జ‌ర్న‌లిస్టుకు వైద్యులు విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ చేశారు. అత‌ని ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. కాగా చిరంజీవి చేసిన ఈ స‌హాయానికి ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు. ఆయ‌న‌లో ఉన్న దాన‌గుణానికి పొంగి పోతున్నారు. ఆయ‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment