Chiranjeevi : ఆ హీరోయిన్‌ని రూమ్‌లోకి పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఎందుకు..?

June 23, 2022 1:14 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించి హిట్స్ కొట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న డ్యాన్స్‌, యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు.. క‌ళ్ల‌లో వ‌త్తులు వేసుకుని ఎదురు చూస్తుంటారు. ఇక చిరంజీవి త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు హీరోయిన్ల‌తో ఈయ‌న చేసిన సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయి. క‌నుక ఆ హీరోయిన్ల‌తో చిరంజీవిని ల‌క్కీ పెయిర్‌గా చెబుతుంటారు. అలాంటి పెయిర్స్‌ల‌లో మాధ‌వి, న‌గ్మా కూడా ఉన్నారు. వీరిద్ద‌రితోనూ చిరంజీవి అనేక సినిమాలు చేశారు. అయితే వీరు చిరంజీవి అంటే మొద‌ట్నుంచీ కోపంగానే ఉండేవార‌ట‌.

చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖ‌రీదులో మాధ‌వి గెస్ట్ రోల్ చేశారు. అయితే ఎందుకో తెలియ‌దు కానీ.. అప్ప‌టి నుంచి చిరంజీవి అంటే మాధ‌వికి న‌చ్చ‌క‌పోయేది. షూటింగ్‌ల‌లో ఆయ‌న‌తో సినిమాలు చేసినా అది షూటింగ్ వ‌ర‌కే.. షూటింగ్ అయ్యాక ఆమె ఆయ‌న‌తో మాట్లాడేవారు కాద‌ట‌. ఈ క్ర‌మంలోనే సురేఖ‌ను చిరంజీవి పెళ్లి చేసుకున్న త‌రువాత మాధ‌వి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్చు వ‌ర్చింద‌ట‌. దీంతో ఆమె ఆయ‌న‌తో అప్ప‌టి నుంచి మ‌ర్యాద‌గా ఉండ‌డం ప్రారంభించింద‌ట‌. అయితే మాధ‌వి అలా ఎందుకు చేసిందో ఎవ‌రికీ ఇప్ప‌టికీ అంతుబ‌ట్ట‌లేదు. ఇక ఈమె విష‌యం ప‌క్క‌న పెడితే చిరంజీవితో క‌లిసి చేసిన హిట్ పెయిర్‌లో న‌గ్మా ఒక‌రు. న‌గ్మాతో చిరు చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి.

Chiranjeevi given strong warning to Nagma at Rikshavodu shooting
Chiranjeevi

అయితే న‌గ్మాతో చిరంజీవి మొద‌ట చేసిన ఘ‌రానా మొగుడు చిత్రంలో వాస్త‌వానికి విజ‌య‌శాంతి న‌టించాల్సి ఉంది. కానీ ఆమెకు కాల్ షీట్స్ కుద‌ర‌లేదు. దీంతో న‌గ్మాను ఎంపిక చేశారు. ఆ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఆమెకు మ‌రో సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. అలా ముగ్గురు మొన‌గాళ్లులో న‌గ్మా న‌టించింది. ఈ మూవీని చిరు సోద‌రుడు నాగ‌బాబు స్వ‌యంగా నిర్మించారు.

అయితే ముగ్గురు మొన‌గాళ్లు సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. న‌గ్మా బాగా సతాయించింద‌ట‌. షూటింగ్‌కు రాకుండా నాగ‌బాబును ముప్పు తిప్ప‌లు పెట్టింద‌ట‌. త‌న‌కు న‌డుం నొప్పి, కాలు నొప్పి అంటూ షూటింగ్‌ల‌కు డుమ్మా కొట్టేద‌ట‌. దీంతో విసుగు చెందిన నాగ‌బాబు ఆమె లేకుండానే కొన్ని సీన్ల‌లో డూప్‌ను పెట్టి షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కూడా ఘ‌న విజ‌యం సాధించింది.

అయితే న‌గ్మా అంత చేసినా చిరు మంచి మ‌న‌సుతో ఆమెకు మ‌ళ్లీ రిక్షావోడు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. కానీ ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనూ న‌గ్మా త‌న తీరు మార్చుకోలేద‌ట‌. దీంతో చిరు ఆమెను త‌న రూమ్ కు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. అయితే ఎలాగోలా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. కానీ అప్ప‌టి నుంచి నగ్మాకు క్ర‌మంగా తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఇలా చిరంజీవిని ఇద్ద‌రు హీరోయిన్లు మాత్రం బాగా తిప్ప‌లు పెట్టార‌ట‌. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా వారికి అవ‌కాశాలు ఇచ్చారు. వాటిని న‌గ్మా మాత్రం స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది. చివ‌ర‌కు అవ‌కాశాలు లేక సినీ రంగం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment