Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం.. ఆచార్య. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా రూ.84 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. చిరంజీవి సినిమా కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. దీంతో చిరంజీవి బాగా హర్టయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ ఫలితం చూసి ఆయన షాకయ్యారు. దీంతో కొద్ది రోజుల పాటు ఈ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆయన కుటుంబ సమేతంగా ఈమధ్యే అమెరికా టూర్‌కు వెళ్లి వచ్చారు. అయితే ఆయన తిరిగి వచ్చాక కూడా ఇంకా ఆచార్య ఇచ్చిన షాక్ నుంచి ఆయన కోలుకోనట్లే కనిపిస్తోంది. అందుకు కారణం ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన ఆయన కోపంతో బయటకు వచ్చేయడమే అని చెప్పవచ్చు.
ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన చిరంజీవి అక్కడ ఓ కారణంతో కోపం చెంది వెంటనే అక్కడ ఉండకుండా బయటకు వచ్చేశారట. అయితే షోను నిర్వహించిన వారు చిన్న మిస్టేక్ చేశారట. స్పాన్సర్ పేరును చెప్పడంలో వారు పొరపాటు చేసి మళ్లీ అదే పేరును రిపీట్ చేశారట. దీనికి ఆగ్రహం చెందిన చిరంజీవి ఆ షో నుంచి బయటకు వచ్చేశారట. అయితే చిరంజీవి విషయంలో జరిగిన తప్పు కాదిది. అయినప్పటికీ ఆయన కోపంతో బయటకు వచ్చేశారట. దీంతో అసలు ఏం జరిగింది.. ఎందుకు ఆయన వెళ్లిపోతున్నారు.. అని విషయం తెలుసుకుని నిర్వాహకులు నచ్చజెప్పేందుకు యత్నించారట. కానీ చిరంజీవి షోలోకి రాలేదట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే చిరంజీవి అంటే ఎంతోమందికి గౌరవం. ఆయన విషయంలో ఎవరూ పొరపాటు చేయరు. అయినప్పటికీ చిరంజీవి కోపంగా బయటకు వచ్చేశారంటే.. ఆయన మనసులో ఏదో ఉందని.. ఆచార్య ఇచ్చిన ఫలితం నుంచి ఆయన ఇంకా కోలుకోలేదని అంటున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నట్లు సమాచారం. అందుకనే చిత్ర ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేయాలని చిరంజీవి మేకర్స్‌కు సూచించారట. మరి ఈ మూవీతో చిరంజీవి హిట్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వస్తారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.