Chicken Biryani : చికెన్ బిర్యానీ ప్లేట్ రూ.55.. అయినా అత‌నికి రూ.ల‌క్ష‌ల్లో సంపాద‌న‌..!

May 14, 2022 10:46 PM

Chicken Biryani : చికెన్ బిర్యానీ.. ఈ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి. చికెన్ బిర్యానీ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఇక హైద‌రాబాద్‌లో ల‌భించే బిర్యానీ అయితే చాలా ఫేమ‌స్. హైద‌రాబాద్‌కు వెళితే అక్క‌డి బిర్యానీని తినాల‌ని చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే బిర్యానీ ధ‌ర మామూలుగా అయితే ప్లేట్‌కు రూ.200కు పైమాటే ఉంటుంది. ఒక మోస్త‌రు హోట‌ల్స్ అయినా స‌రే.. క‌నీసం రూ.150 వ‌ర‌కు చెల్లించాల్సిందే. కానీ రూ.55కే అత‌ను బిర్యానీని విక్ర‌యిస్తున్నాడు. అవును.. మీరు విన్న‌ది నిజ‌మే.

రూ.55కే ఒక ప్లేట్ బిర్యానీని తిన‌వ‌చ్చు. అయితే మ‌రీ అంత త‌క్కువ ధ‌ర ఏంటి ? క‌ల్తీ వ‌స్తువుల‌తో త‌యారు చేసి విక్ర‌యిస్తారా ? అన్న సందేహం ఎవ‌రికైనా క‌లుగుతుంది. కానీ అది నిజం కాదు. స్వ‌చ్ఛ‌మైన అస‌లు సిస‌లైన ప‌దార్థాల‌తో బిర్యానీని త‌యారు చేసి విక్ర‌యిస్తారు. మ‌రి రేటు ఎందుకు అంత త‌క్కువ అంటే.. అక్క‌డే ఉంది అస‌లు క‌థ‌.

Chicken Biryani business fetching him lakhs of rupees
Chicken Biryani

రేటు త‌క్కువ అంటే స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే ఎక్కువ‌గా కొంటారు. బిర్యానీ మ‌న‌కు బ‌య‌ట చాలా ఎక్కువ రేటు ఉంటుంది. కానీ చాలా త‌క్కువ ధ‌ర‌కే అలాంటి నాణ్య‌త‌తోనే బిర్యానీ ల‌భిస్తే.. అప్పుడు ఆ బిర్యానీని ఎక్కువ మంది కొంటారు. దీంతో బిజినెస్ ఎక్కువ‌గా జ‌రుగుతుంది. క‌నుక త‌క్కువ ధ‌రకు అమ్మినా ఫ‌ర్వాలేదు. మార్జిన్ వ‌స్తే చాలు.. అదీ అస‌లు క‌థ‌. అందుక‌నే ఆ బిర్యానీ సెంట‌ర్ వారు కేవ‌లం రూ.55కే ఒక ప్లేట్ చికెన్ బిర్యానీని విక్ర‌యిస్తున్నారు. ఈ బిర్యానీ పాయింట్ హైద‌రాబాద్‌లో ఉంది. పేరు కాకా 55 బిర్యానీ.

హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి ఏరియాకు వెళ్తే.. కాకా 55 బిర్యానీ స్పాట్ అంటే ఎవ‌రైనా చెబుతారు. అంత‌లా ఈ బిర్యానీ పాయింట్ ఫేమ‌స్ అయింది. ఇక వీరు సాధార‌ణ రోజుల్లో రోజుకు 600 ప్లేట్ల వ‌ర‌కు బిర్యానీని విక్ర‌యిస్తారు. మ‌ధ్యాహ్నం, రాత్రి వేర్వేరుగా వండి వ‌డ్డిస్తారు. ఇక సెల‌వు రోజుల్లో అయితే రోజుకు సుమారుగా 1000 ప్లేట్ల బిర్యానీని విక్ర‌యిస్తారు. ఒక ప్లేట్ బిర్యానీ ధ‌ర రూ.55. వారికి చేసేందుకు, ఇత‌ర ఖ‌ర్చులు క‌లిపి రూ.38 ఖ‌ర్చ‌వుతుంది. రూ.17 మార్జిన్ ల‌భిస్తుంది. అయిన‌ప్ప‌టికీ రోజుకు 600 ప్లేట్లు అమ్మితే.. రూ.10,200 వ‌స్తాయి. నెల‌కు రూ.3.06 ల‌క్ష‌లు అన్న‌మాట‌. సాధార‌ణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కే ఇలాంటి ఆదాయం వ‌స్తుంది. కానీ బిర్యానీ అమ్ముతూ కూడా ఈ సెంట‌ర్‌వారు రూ.ల‌క్ష‌లు గడిస్తున్నారు. ప‌నిలేద‌ని, ఉద్యోగం దొర‌క‌లేద‌ని నిరాశ‌కు గుర‌వకుండా తమ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ్డారు. వీరు ఎంతో మందికి యువ‌త‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment