Chandigarh University : సంచ‌ల‌నం సృష్టిస్తున్న చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీ సంఘ‌ట‌న‌.. విద్యార్థినులు స్నానం చేస్తున్న 60 వీడియోలు లీక్‌..? నిజ‌మేనా..?

September 18, 2022 8:53 PM

Chandigarh University : చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీలో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. యూనివ‌ర్సిటీలో చదువుతున్న ప‌లువురు విద్యార్థినుల‌కు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వ‌ర‌కు లీకయ్యాయ‌ని వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి. ఈ క్ర‌మంలోనే యూనివ‌ర్సిటీకి చెందిన విద్యార్థులు ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న విద్యార్థినుల‌కు చెందిన స్నానం చేస్తున్న వీడియోలు 60 వర‌కు లీక‌య్యాయ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని పోలీసులు తెలిపారు. ఓ విద్యార్థిని త‌న వీడియోను షిమ్లాలో ఉన్న త‌న బాయ్ ఫ్రెండ్‌కు షేర్ చేసిందని.. అయితే ఆమెను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘ‌ట‌న‌పై స్పందించిన చండీగ‌ఢ్ విద్యాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు తెలిపారు. అయితే ఈ సంఘ‌ట‌న కార‌ణంగా విద్యార్థినులు ఎవ‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని.. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు.

Chandigarh University news police told the truth
Chandigarh University

అయితే పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మ‌న్ మాట్లాడుతూ.. ఈ సంఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు తెలిపారు. మ‌న కూతుళ్లు మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, ఈ సంఘ‌ట‌న‌లో దోషులను విడిచిపెట్ట‌బోమ‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, ఈ సంఘ‌ట‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. అలాగే ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ సంఘ‌ట‌న చాలా సిగ్గుచేట‌న్నారు. నిజానిజాలు నిగ్గు తేలే వ‌ర‌కు వేచి చూడాల‌ని కోరారు. అయితే మ‌రోవైపు చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీలో మాత్రం విద్యార్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment