గురువారం, జూన్ 11, 2026
mythology

ఈ ఏడాదిలో ఈ ప్ర‌మాదాలు, ఘోరాలు, ఉత్పాతాలు జ‌ర‌గ‌నున్నాయ‌ట‌..!

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఇవి చోటుచేసుకుంటాయట. ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సినిమాలో కూడా మనం ఎన్నో చూశాం. అయితే ఇవి ఉగాది తర్వాత చోటు…

ఈ ఏడాదిలో ఈ ప్ర‌మాదాలు, ఘోరాలు, ఉత్పాతాలు జ‌ర‌గ‌నున్నాయ‌ట‌..!

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది తర్వాత ఇవి చోటుచేసుకుంటాయట. ఇప్పటికే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సినిమాలో కూడా మనం ఎన్నో చూశాం. అయితే ఇవి ఉగాది తర్వాత చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2023 నుండి 2024 మధ్యలో సమాజంలో అనేక విలువలు దిగజారి పోతాయని చెప్పారు వీరబ్రహ్మం గారు. ముఖ్యంగా వివాహ కట్టుబాట్లని మర్చిపోయి ఇతరల వ్యామోహంలో పడిపోతారట. డబ్బు కోసం మనుషులు చావడానికి, చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారట.

అదే విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుండి రాళ్లు పడి ఇబ్బందులు కలుగుతాయట. అనేక రకాల వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2025- 26 మధ్యలో భారత దేశంలో అనుకోని సంఘటనలేవో జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందర్నీ సత్ప్రవర్తన వైపు వెళ్లేలా చేస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.

brahmam garu told these incidents will happen this year

ప్రపంచ జనాభా 2065 నాటికి పడిపోతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. 2024 నాటికి కొత్త నక్షత్రం ఆకాశంలో ఉద్భవిస్తుంది. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు వేస్తాయి. నెత్తురు కక్కుతూ అనారోగ్య సమస్యలతో జనాలు చనిపోతారు. జంతువులు కూడా అలాగే చచ్చిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఉంది. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన ఉన్నవాళ్లు భయంకరమైన కష్టాలు పడి మరణిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని కూడా బ్రహ్మంగారు చెప్పారు.

అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మనుషుల్ని చంపుతాయని కూడా చెప్పారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ కారణంగా గొడవ పడి చనిపోతారట. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయని కూడా కాలజ్ఞానంలో చెప్పారు. 5000 ఏళ్ల‌ తర్వాత కాశీలో గంగ కనపడకుండా మాయమైపోతుందని కూడా చెప్పారు. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇవి జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆయన చెప్పిన చాలా విషయాలు జరగడం మనం విన్నాము. చూశాము.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి