Bigg Boss 5 : బిగ్ బాస్ కండలవీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు. ఊహించని ఎలిమినేషన్‌తో ఆయన అభిమానులతోపాటు హౌజ్‌మేట్స్ కూడా షాక్ అయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ అనీ కంటతడి పెట్టుకుంది. గేమ్ మాత్రమే కాకుండా అన్నీ చూస్తున్నారంటూ విశ్వ ఎలిమినేషన్ తర్వాత మాట్లాడాడు షణ్ముఖ్. ఏదేమైనా విశ్వ ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారిలో శ్వేతా వర్మ ఎలిమినేషన్ కూడా ఎవరూ ఊహించలేదు. అలాగే విశ్వను కూడా అనవసరంగా పంపించేశారంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మేల్ కంటెస్టెంట్స్‌లో అందరికంటే స్ట్రాంగ్ అయిన విశ్వని పంపించేశాక గేమ్‌లో ఫన్ ఏముంటుంది ? అని కొందరు మండిపడుతున్నారు. టాప్ 5లో నిలుస్తాడు అనుకున్న విశ్వ ఇప్పుడు బయటకు రావడంతో ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది.
విశ్వ వారానికి 2 నుండి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అతడు హౌస్‌లో తొమ్మిది వారాలు ఉన్నాడు. అంటే తొమ్మిది వారాలకు కలిపి రూ.22 లక్షలు వెనకేసి ఉంటాడని అంటున్నారు. బిగ్‌బాస్ తర్వాత విశ్వ ఫేట్ ఏమన్నా మారుతుందా అనేది చూడాలి. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన విశ్వ తన మనసులో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్ 5లో ఉండాలన్నాడు. సన్నీకి 4వ ర్యాంకిచ్చాడు. షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్‌ని సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…