Bigg Boss 5 : తొమ్మిదో వారం ఎలిమినేట్ అయిన విశ్వ.. ఎంత రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడో తెలుసా ?

November 8, 2021 10:48 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ కండ‌ల‌వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు. ఊహించ‌ని ఎలిమినేష‌న్‌తో ఆయ‌న అభిమానుల‌తోపాటు హౌజ్‌మేట్స్ కూడా షాక్ అయ్యారు. ఎవరి జోలికి పోకుండా పర్ఫెక్ట్‌గా గేమ్‌ ఆడేవాడు వెళ్లిపోయాడు అంటూ అనీ కంటతడి పెట్టుకుంది. గేమ్ మాత్ర‌మే కాకుండా అన్నీ చూస్తున్నారంటూ విశ్వ ఎలిమినేష‌న్ త‌ర్వాత మాట్లాడాడు ష‌ణ్ముఖ్. ఏదేమైనా విశ్వ ఎలిమినేష‌న్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Bigg Boss 5 do you know how much vishwa got remuneration

ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారిలో శ్వేతా వర్మ ఎలిమినేషన్ కూడా ఎవరూ ఊహించలేదు. అలాగే విశ్వను కూడా అనవసరంగా పంపించేశారంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మేల్ కంటెస్టెంట్స్‌లో అందరికంటే స్ట్రాంగ్ అయిన విశ్వని పంపించేశాక గేమ్‌లో ఫ‌న్ ఏముంటుంది ? అని కొంద‌రు మండిప‌డుతున్నారు. టాప్ 5లో నిలుస్తాడు అనుకున్న విశ్వ ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న రెమ్యునరేషన్ ఇప్పుడు హ‌ట్ టాపిక్‌గా మారింది.

విశ్వ వారానికి 2 నుండి రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అతడు హౌస్‌లో తొమ్మిది వారాలు ఉన్నాడు. అంటే తొమ్మిది వారాలకు కలిపి రూ.22 లక్షలు వెన‌కేసి ఉంటాడ‌ని అంటున్నారు. బిగ్‌బాస్ త‌ర్వాత విశ్వ ఫేట్ ఏమ‌న్నా మారుతుందా అనేది చూడాలి. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన విశ్వ త‌న మ‌న‌సులో ఉన్న‌ టాప్‌ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్‌ 5లో ఉండాలన్నాడు. సన్నీకి 4వ ర్యాంకిచ్చాడు. షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్‌ని సీజన్‌కు విన్నర్‌గా మొదటి స్థానంలో నిలబెట్టాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now