NTR : దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం క్షణం తీరిక లేకుండా గడిపిన ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజులలో ఆయన కొరటాల శివతో కలిసి పని చేయనుండగా, ఆ లోపు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతున్నారు. రీసెంట్‌గా తన ఫ్యామిలీతో దీపావళి వేడుక జరుపుకున్నారు ఎన్టీఆర్. తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు.
ఇక తాజాగా భార్య లక్ష్మీ ప్రణతితోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించి పిక్స్ బయటకు వచ్చాయి. అయితే ఫొటోల్లో తారక్ చేతికి బ్యాండేజీతో కనిపించారు. ఇది అభిమానులని బాధిస్తోంది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఈ గాయమైనట్టు తెలుస్తుండగా, ఇది నయం కావడానికి రెండు మూడు వారాలు పడుతుందట.
ఇక రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ నుండి నవంబర్ 10న క్రేజీ సాంగ్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన చేస్తూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వెస్టర్న్ స్టైల్లో మాస్ స్టెప్పులతో ఇరగదీసినట్లు పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…