NTR : ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీ పార్టీ.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ పిక్స్..

November 8, 2021 9:57 AM

NTR : దాదాపుగా మూడు సంవ‌త్స‌రాల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఆయ‌న కొర‌టాల శివ‌తో క‌లిసి ప‌ని చేయ‌నుండ‌గా, ఆ లోపు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో దీపావళి వేడుక జ‌రుపుకున్నారు ఎన్టీఆర్. త‌న కుమారులు అభయ్ రామ్‌, భార్గవ్‌ రామ్‌ల‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు.

NTR partied with friend and family members

ఇక తాజాగా భార్య లక్ష్మీ ప్రణతితోపాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించి పిక్స్ బయటకు వచ్చాయి. అయితే ఫొటోల్లో తారక్ చేతికి బ్యాండేజీతో కనిపించారు. ఇది అభిమానుల‌ని బాధిస్తోంది. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న స‌మ‌యంలో ఈ గాయ‌మైన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇది నయం కావ‌డానికి రెండు మూడు వారాలు ప‌డుతుంద‌ట‌.

ఇక రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ నుండి నవంబర్ 10న క్రేజీ సాంగ్ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేస్తూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వెస్టర్న్ స్టైల్లో మాస్ స్టెప్పులతో ఇరగదీసినట్లు పోస్ట‌ర్ వ‌దిలారు. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది. మ‌రోవైపు ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now