Lijomol : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా జై భీమ్. ఈ సినిమాలో లాయర్ పాత్రలో సూర్య యాక్టింగ్ అద్భుతం అనే చెప్పాలి. జై భీమ్ సినిమాలో హీరో సూర్య పాత్ర తర్వాత అంతే పేరు సంపాదించుకున్న క్యారెక్టర్ చిన్నతల్లి. గిరిజన మహిళగా, నిండు గర్భిణిగా తన భర్త కోసం పోరాడే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా గిరిజన ప్రజలపై పోలీసులు అమానుషంగా ఎలా కేసులు పెడతారు, వారితో ప్రవర్తన ఎలా ఉంటుంది.. అనే అంశాల్ని కీలకంగా తెరకెక్కించారు డైరెక్టర్.
1993లో తమిళనాడులో ఓ గిరిజన మహిళ కోసం లాయర్ చంద్ర చేసిన పోరాటమే జై భీమ్ సినిమా. చిన్నతల్లి పాత్రలో నటి లిజోమోల్ యాక్ట్ చేశారు. ఈమె పాత్ర పూర్తిగా డీ గ్లామర్ రోల్. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి ప్రశంసలు సంపాదించుకుంటోంది. తన పాత్ర గురించి ఈ నటి ఇంట్రెస్టింగ్ విశేషాల్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా తనపై ఎక్కువగా ప్రభావం చూపించిందని అంటోంది. మరీ ముఖ్యంగా చిన్నతల్లి పాత్రలో నటిస్తున్నప్పుడు గ్లిజరిన్ లేకుండానే ఏడుపు సీన్స్ లలో నటించానని తెలిపింది.
ఇప్పటి వరకు తాను చేసిన క్యారెక్టర్స్ లో ఈ పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుంటుందని, అలాగే ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటోంది. ఈ సినిమాలో ఎన్నో సీన్స్ లో చిన్నతల్లిని పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ సీన్స్ లో నటించేటప్పుడు ఆమె గ్లిజరిన్ ఉపయోగించలేదని నటి లిజో తెలిపింది. ఆ సీన్ వివరించినప్పుడు తనకు ఆటోమేటిక్ గా కన్నీళ్ళు వచ్చేవని అన్నారు. అలాగే డైరెక్టర్ సీన్ ఒకే అయ్యాక.. కట్ చెప్పినా కూడా కన్నీళ్ళు ఆగేవి కాదని.. లిజోమోల్ తెలిపింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…