Anushka Shetty : పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.. స్వీటీకి కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా..?

August 26, 2022 7:45 PM

Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను మరింత పెంచాయి. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ధం మూవీలో నటించింది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయి ఫర్వాలేదు అనిపించింది. ఆ తరువాత వెండి తెరపై కనిపించలేదు అనుష్క.

అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైనే అవుతోంది. 40 ఏళ్లు వయసున్న స్వీటీ మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు.

Anushka Shetty may marry very soon a business person
Anushka Shetty

తాజాగా అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బడా బిజినెస్ మ్యాన్‌తో అనుష్క పెళ్లి జరుగనుందట. అతను బెంగళూరుకు చెందిన వారని ఒకరు అంటుండగా.. దుబాయికి చెందిన వాడని ఇంకొకరు అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఏదేమైనా అనుష్క ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో స్వీటీ తీపి కబురు చెబుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అనుష్క జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేయనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment