ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఏపీ అప్పుల్లో ఉన్నా.. మీకు విలాసాలా?: జగన్ నిప్పులు

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. Photo Credit: YSR Congress Party/X.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు లగ్జరీ జీవనశైలి గ‌డుపుతున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జ‌గన్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఉన్నాయన్నారు. అదే విధంగా లోకేష్, పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఈ విధంగా విహారయాత్రలు చేయడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.

క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లాలా: వైఎస్ జ‌గ‌న్

మంత్రి లోకేష్ విదేశీ ప్రయాణాలపై ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్, కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్లాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఒక రోజు విజయవాడలో ఉంటారు, మరుసటి రోజు హైదరాబాద్‌లో ఉంటారు. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లి, మరుసటి ఉదయానికే తిరిగి విజయవాడకు రావడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఆ మ్యాచ్‌ను టీవీలోనే చూసినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడి వ్యవహార శైలిని కుక్క తోక వంకరతో పోల్చిన జగన్, ఇంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ప్రవర్తన చేయాలా అని విమర్శించారు. టీవీలో చూడగలిగే మ్యాచ్ కోసం విదేశాలకు వెళ్లడం ప్రజాధన దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని, అప్పులు పెరుగుతున్నాయని పేర్కొన్న జగన్, అలాంటి సమయంలో అధికారంలో ఉన్నవారు విలాసవంతమైన ప్రయాణాల్లో మునిగిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలన్నీ అసత్యాలని ఆయన ఆరోపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM