వినోదం

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

‘ఫౌజీ’ షూటింగ్ స్పాట్ నుంచి కంటెంట్ లీక్ చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన చిత్ర యూనిట్. Photo Credit: Fauzi/X.

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు, వీడియోలు లీక‌వుతున్నాయి. చిత్ర యూనిట్‌లోని కొంద‌రు వాటిని లీక్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేస్తున్నారు. దీంతో చిత్రంపై దాని ప్ర‌భావం ప‌డుతోంది. ఒక వేళ లుక్ బాగా లేక‌పోతే సినిమాపై ఆ లీకుల ప్ర‌భావం నెగెటివ్‌గా ప‌డుతోంది. అయితే దీన్ని నియంత్రించేందుకు చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు, యూనిట్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఫౌజీ చిత్ర మేక‌ర్స్ కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. దీంతో వారు స్పందించారు. త‌మ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి కంటెంట్‌ను లీక్ చేసినా, దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా నుంచి ఇచ్చే అప్ డేట్ కోసం ఎదురు చూడాల‌ని, లీకుల‌ను చూస్తే అప్ డేట్‌లో ఇచ్చే మ్యాజిక్‌ను మిస్ అవుతారని అన్నారు.

లీక్ చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

ప్ర‌భాస్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఫౌజీ చిత్రంలో హీరో లుక్ ఏ విధంగా ఉంటుందో తెలియ‌జేసే విధంగా కొన్ని ఫొటోలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. ప్ర‌స్తుతం అవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఆ లీకులపై స్పందించిన చిత్ర యూనిట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న వారికి తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. త‌మ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీక‌య్యాయ‌ని, వాటిని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తున్నార‌నే విష‌యం త‌మ దృష్టికి వచ్చింద‌ని తెలిపింది. ఈ విధ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నవారిపై అన‌ధికార కంటెంట్ వ్యాప్తి పేరుతో ఫిర్యాదు చేస్తామ‌ని, అలాంటి వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి లీకులు త‌మ వ‌ర్క్‌ను దెబ్బ తీస్తున్నాయ‌ని, వెండితెర వేదిక‌గా ఒక అద్భుతాన్ని అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపింది. ప్రేక్ష‌కుల ఎదురు చూపుల‌కు త‌గిన ఫ‌లితాన్ని అందిస్తామ‌ని, అందువ‌ల్ల ఇలాంటి లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నామ‌ని పేర్కొంది.

లీక్స్‌తో మ్యాజిక్‌ను పాడు చేయ‌కండి..

ఇక ఇదే విష‌యంపై చిత్ర ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక పోస్టు పెట్టారు. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే విధంగా ఒక విశేష‌మైన కంటెంట్‌ను అందించేందుకు తాము ఎంతో శ్ర‌మిస్తున్నామ‌ని తెలిపారు. లీక్స్‌తో ఆ మ్యాజిక్‌ను పాడు చేయ‌వ‌ద్ద‌ని తాము లీకు వీరుల‌ను కోరుతున్నామ‌ని పేర్కొన్నారు. కాగా ఫౌజీ సినిమాను 1940ల నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో సినిమా విడుద‌ల‌పై ప్రేక్ష‌కులు, ప్ర‌భాస్ ప్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM