వినోదం

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

శర్వానంద్ ‘బైకర్’ చిత్ర విజయోత్సవ వేడుకల్లో రివ్యూయర్లపై స్పందించిన జీవిత రాజశేఖర్. Photo Credit: Shreyas Media/X.

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని, ప్రేక్ష‌కులు రివ్యూల‌ను చ‌దివి కాకుండా సినిమా ఎలా ఉందో స్వయంగా థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాల‌ని న‌టి జీవిత రాజ‌శేఖ‌ర్ కోరారు. ఆమె భ‌ర్త‌, న‌టుడు రాజ‌శేఖ‌ర్ న‌టించిన లేటెస్ట్ మూవీ బైక‌ర్ తాజాగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. న‌టుడు శ‌ర్వానంద్ ఇందులో హీరోగా యాక్ట్ చేయ‌గా, రాజ‌శేఖ‌ర్ సపోర్టింగ్ రోల్ చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య‌వంతం అయింద‌ని చిత్ర యూనిట్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి జీవిత రాజ‌శేఖ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె సినిమా రివ్యూయ‌ర్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సినిమా బాగా తీసినా విమ‌ర్శిస్తున్నారు..

శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన బైక‌ర్ మూవీ దేశంలోనే తొలి స్పోర్ట్స్ మోటోక్రాస్ రేసింగ్ యాక్ష‌న్ డ్రామాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంక‌ర ద‌ర్శ‌కత్వం వ‌హించారు. మూవీకి తొలి రోజే అద్బుత‌మైన స్పంద‌న ల‌భించింది. దీంతో మేక‌ర్స్ బైక‌ర్ సినిమా స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన స‌క్సెస్ మీట్‌కు హాజ‌రైన న‌టి జీవిత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ సినిమాను తాము ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావంతో క‌ఠోర శ్ర‌మ‌కోర్చి తీస్తామ‌ని, తాము సినిమాను ఎంత బాగా తీసినా కూడా కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటార‌ని విచారం వ్య‌క్తం చేశారు. రివ్యూల‌ను చ‌దువుతుంటే సినిమా ఎలా తీయాలో రివ్యూయ‌ర్ల‌నే అడుగుదామా అనిపిస్తుంద‌ని పేర్కొన్నారు.

రివ్యూల‌ను చ‌ద‌వ‌కుండా సినిమా చూడండి..

సినిమాలో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉంటే మెలో డ్రామా అని రివ్యూయ‌ర్లు తీసి పారేస్తార‌ని, అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని విమ‌ర్శిస్తార‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ అన్నారు. ఏది న‌మ్మాలో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని, ఒక సినిమా వెనుక ఎంతో మంది క‌ష్టం, కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చు ఉంటుంద‌ని అన్నారు. ప్రేక్ష‌కులు రివ్యూల‌ను చ‌ద‌వ‌కుండా స్వ‌యంగా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని ఆమె కోరారు. ప్రేక్ష‌కుడి రివ్యూనే త‌మ‌కు ముఖ్య‌మ‌ని, ఏమైనా గొడ‌వ‌లు ఉన్నా, మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఉన్నా మ‌నసు విప్పి మాట్లాడుకోవాల‌ని సూచించారు. ఎవ‌రినీ దూరం పెట్ట‌వ‌ద్ద‌ని, సంతోషంగా ఉండ‌డ‌మే జీవిత‌మ‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM