టెక్నాల‌జీ

రియల్‌మి పవర్ డేస్ సేల్ ప్రారంభం.. 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు!

రియల్‌మీ పవర్ డేస్ సేల్‌లో భాగంగా ఆఫర్లలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లు. Photo Credit: Realme India.

స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్ మి భార‌త్‌లో రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్ పేరిట ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్ర‌వ‌రి 22, 2026వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగుతుంద‌ని రియ‌ల్‌మి తెలిపింది. ఇందులో భాగంగా ప‌లు రియ‌ల్ మి ఫోన్ల‌ను వినియోగ‌దారులు త‌గ్గింపు ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా రియ‌ల్‌మి పి4, ప‌వ‌ర్ 5జి, పి4 5జి, రియ‌ల్‌మి పీ4ఎక్స్ 5జి వంటి ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ సేల్ అందుబాటులో ఉంద‌ని రియ‌ల్‌మి తెలిపింది.

రియ‌ల్‌మి పి4 ప‌వ‌ర్ 5జి

ఈ సేల్‌లో భాగంగా రియ‌ల్‌మి పి4 ప‌వ‌ర్ 5జి ఫోన్‌ను వినియోగ‌దారులు త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ఫోన్‌లో 10,001 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెస‌ర్‌, అమోలెడ్ డిస్‌ప్లే, 6500 నిట్స్ బ్రైట్ నెస్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

  • ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.30,999 ఉండ‌గా ఇప్పుడిది రూ.28,999కు ల‌భిస్తోంది.
  • 8జీబీ, 256జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.27,999 ఉండ‌గా దీన్ని రూ.25,999కు కొన‌వ‌చ్చు.
  • 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.25,999 ఉండ‌గా దీన్ని రూ.23,999కు అందిస్తున్నారు.

రియ‌ల్‌మి పి4 5జి

ఈ సేల్‌లో రియ‌ల్‌మి పి4 5జి ఫోన్‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5జి ప్రాసెస‌ర్, 6.77 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, 4500 నిట్స్ బ్రైట్ నెస్‌, 50ఎంపీ, 8ఎంపీ రియ‌ర్ కెమెరాలు, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

  • ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.23,999 ఉండ‌గా, రూ.21,999కు ప్ర‌స్తుతం ల‌భిస్తోంది.
  • 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.21,999 ఉండ‌గా ఇప్పుడు దీన్ని రూ.19,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • 6జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.19,999 ఉండ‌గా దీన్ని రూ.17,999కు ఇస్తున్నారు.

రియ‌ల్‌మి పి4ఎక్స్ 5జి

ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు రియ‌ల్‌మి పి4ఎక్స్ 5జి ఫోన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెస‌ర్ ఉండ‌గా, 7000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ, 18జీబీ వ‌ర‌కు డైన‌మిక్ ర్యామ్‌, 50ఎంపీ ఏఐ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

  • ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.20,999 ఉండ‌గా దీన్ని ఇప్పుడు రూ.18,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • 8జీబీ, 128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.18,999 ఉండ‌గా ప్ర‌స్తుతం రూ.16,999కు అందిస్తున్నారు.
  • 6జీబీ, 128జీబీ మోడ‌ల్ అస‌లు ధ‌ర రూ.17,999 ఉండ‌గా, దీన్ని ఇప్పుడు రూ.15,999కు కొన‌వ‌చ్చు.

ఇలా రియ‌ల్‌మి సంస్థ ఆయా ఫోన్ వేరియంట్ల‌పై రూ.2వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందించ‌డంతోపాటు 3 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని సైతం ఇస్తున్న‌ట్లు తెలిపింది.

గ‌మ‌నిక‌: వినియోగ‌దారులు రియ‌ల్‌మి లేదా ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతాయి. స్టాక్ ఉన్నంత వ‌ర‌కే ఇస్తారు. క‌నుక ఆయా వివ‌రాల‌ను ఆ సైట్ల‌లో తెలుసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM