
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి భారత్‌లో రియల్‌మి పవర్ డేస్ సేల్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. గురువారం (ఫిబ్రవరి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్రవరి 22, 2026వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని రియల్‌మి తెలిపింది. ఇందులో భాగంగా పలు రియల్ మి ఫోన్లను వినియోగదారులు తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా రియల్‌మి పి4, పవర్ 5జి, పి4 5జి, రియల్‌మి పీ4ఎక్స్ 5జి వంటి ఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. రియల్‌మి ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్కార్ట్లోనూ ఈ సేల్ అందుబాటులో ఉందని రియల్‌మి తెలిపింది.
రియల్‌మి పి4 పవర్ 5జి
ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి పి4 పవర్ 5జి ఫోన్‌ను వినియోగదారులు తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లో 10,001 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, అమోలెడ్ డిస్ప్లే, 6500 నిట్స్ బ్రైట్ నెస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
- ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.30,999 ఉండగా ఇప్పుడిది రూ.28,999కు లభిస్తోంది.
- 8జీబీ, 256జీబీ మోడల్ ధర రూ.27,999 ఉండగా దీన్ని రూ.25,999కు కొనవచ్చు.
- 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.25,999 ఉండగా దీన్ని రూ.23,999కు అందిస్తున్నారు.
రియల్‌మి పి4 5జి
ఈ సేల్‌లో రియల్‌మి పి4 5జి ఫోన్‌ను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5జి ప్రాసెసర్, 6.77 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, 4500 నిట్స్ బ్రైట్ నెస్, 50ఎంపీ, 8ఎంపీ రియర్ కెమెరాలు, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను అందిస్తున్నారు.
- ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడల్ అసలు ధర రూ.23,999 ఉండగా, రూ.21,999కు ప్రస్తుతం లభిస్తోంది.
- 8జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు దీన్ని రూ.19,999 కు కొనుగోలు చేయవచ్చు.
- 6జీబీ, 128జీబీ మోడల్ ధర రూ.19,999 ఉండగా దీన్ని రూ.17,999కు ఇస్తున్నారు.
రియల్‌మి పి4ఎక్స్ 5జి
ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు రియల్‌మి పి4ఎక్స్ 5జి ఫోన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉండగా, 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18జీబీ వరకు డైనమిక్ ర్యామ్, 50ఎంపీ ఏఐ కెమెరా వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తున్నారు.
- ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ, 256జీబీ మోడల్ అసలు ధర రూ.20,999 ఉండగా దీన్ని ఇప్పుడు రూ.18,999 కు కొనుగోలు చేయవచ్చు.
- 8జీబీ, 128జీబీ మోడల్ అసలు ధర రూ.18,999 ఉండగా ప్రస్తుతం రూ.16,999కు అందిస్తున్నారు.
- 6జీబీ, 128జీబీ మోడల్ అసలు ధర రూ.17,999 ఉండగా, దీన్ని ఇప్పుడు రూ.15,999కు కొనవచ్చు.
ఇలా రియల్‌మి సంస్థ ఆయా ఫోన్ వేరియంట్లపై రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను అందించడంతోపాటు 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం ఇస్తున్నట్లు తెలిపింది.
గమనిక: వినియోగదారులు రియల్‌మి లేదా ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఆఫర్లు, డిస్కౌంట్లు ఎప్పటికప్పుడు మారుతాయి. స్టాక్ ఉన్నంత వరకే ఇస్తారు. కనుక ఆయా వివరాలను ఆ సైట్లలో తెలుసుకోవాల్సి ఉంటుంది.












