ఆంధ్ర‌ప్ర‌దేశ్

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు. Photo Credit: Ambati Rambabu/X.

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌నే కేసుతోపాటు ప‌లు ఇత‌ర కేసుల్లో అరెస్టై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు జైలు నుంచి విడుద‌ల‌య్యారు. అంబ‌టి రాంబాబుకు అన్ని కేసుల్లోనూ గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌గా ఆయ‌న బుధ‌వారం (ఫిబ్ర‌వ‌రి 18, 2026) జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అంబ‌టి రాంబాబు ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై పోలీసులు 36 కేసులు న‌మోదు చేశారు. పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌నే ఆరోప‌ణ‌ల‌పై మ‌రో 16 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే స‌త్తెన‌ప‌ల్లి సంక్రాంతి సంబ‌రాల ల‌క్కీ డ్రాలో అవినీతికి పాల్ప‌డ్డారనే ఆరోప‌ణ‌ల‌పై కూడా అంబ‌టిపై కేసు న‌మోదు అయింది. అయితే ఈ కేసుల‌న్నింటిలోనూ ఆయ‌న‌కు బెయిల్ ల‌భించ‌డంతో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

దేవుడు ఉన్నాడు, ధ‌ర్మ‌మే గెలుస్తుంది: అంబ‌టి

జైలు నుంచి విడుద‌ల అయిన అనంత‌రం అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై దాడులకు పాల్ప‌డ్డార‌ని, త‌న‌ను హింసించార‌ని ఆరోపించారు. త‌న భార్య‌, పిల్ల‌ల్ని త‌రిమార‌ని, త‌న కార్ల‌ను ధ్వంసం చేశార‌ని పేర్కొన్నారు. త‌న ఇల్లు త‌గల‌బెట్టేందుకు య‌త్నించార‌ని, అయిన‌ప్ప‌టికీ తాను ప‌ట్టించుకోన‌ని అన్నారు. తాను ఒక బాధితుడిని అయితే బాధితుడిని జైలులో పెట్టి నిందితుల‌ను వ‌దిలేశార‌ని ఆరోపించారు. పార్టీల‌కు అతీతంగా త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారికి అంబ‌టి కృజ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌పై జ‌రిగిన దాడిని ఖండించిన వారికి ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేవుడు ఉన్నాడ‌ని, ఎప్ప‌టికైనా ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా అంబ‌టి త‌న ఎక్స్ ఖాతాలోనూ పోస్టు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా అడుగు వెనక్కి వేసేది లేదు, వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చేవరకు తన పోరాటం ఆగద‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM