ఉద్యోగాలు

ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు.. 252 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

ఆధార్ సూపర్ వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. Photo Credit: UIDAI.

కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ (MeitY) శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న కామన్ స‌ర్వీస్ సెంట‌ర్స్ (CSC) ఇ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ఆధార్ ఆప‌రేట‌ర్, సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు సీఎస్‌సీ ఇ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ ఇండియ‌న్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేశారు. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 252 ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజ‌ర్‌ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి 11, 2026న ప్రారంభం కాగా మార్చి 10, 2026 వ‌ర‌కు గ‌డువు విధించారు. అభ్య‌ర్థులు సీఎస్‌సీ ఇ-గ‌వ‌ర్నెన్స్ స‌ర్వీసెస్ ఇండియ‌న్ వెబ్‌సైట్ csc.gov.inను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు..

  • ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజర్ పోస్టుల‌కు 12వ త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు లేదా వాటికి స‌మాన‌మైన విద్యార్హ‌త క‌లిగి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.
  • పోస్టుకు ఎంపికైన వారు ఏడాది పాటు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌నిచేయాల్సి ఉంటుంది.
  • దేశ‌వ్యాప్తంగా ఉన్న ఏ ప్రాంతంలో అయినా స‌రే ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
  • యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చేత గుర్తించ‌బ‌డిన ఏదైనా టెస్టింగ్‌, స‌ర్టిఫయింగ్‌ ఏజెన్సీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి అభ్యర్థులు ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజ‌ర్ స‌ర్టిఫికెట్‌ను పొంది ఉండాలి.
  • అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.
  • క‌మ్యూనికేష‌న్స్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.
  • స్థానికంగా ఆధార్ ఆప‌రేట‌ర్ లేదా సూప‌ర్ వైజ‌ర్ పోస్టులు ఖాళీగా ఉంటే స్థానికుల‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు అభ్య‌ర్థులు క‌నీస వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు ఉండాలి. సెమి-స్కిల్డ్ మ్యాన్ ప‌వ‌ర్డ్ విభాగంను బ‌ట్టి ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌వారి వేత‌నాలు ఉంటాయి. అభ్య‌ర్థుల‌ను అర్హ‌త‌, అప్లికేష‌న్లు, డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంత‌రం ఎంపిక చేసిన ఆధార్ సేవా కేంద్ర (ASK)లో పోస్టులో నియ‌మిస్తారు.

దర‌ఖాస్తు ఇలా..

  • అధికారిక సీఎస్‌సీ జాబ్ పోర్ట‌ల్ https://csc.gov.in/ask ను సంద‌ర్శించాలి.
  • అందులో అభ్య‌ర్థులు త‌మ వివ‌రాలతో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఇది వ‌ర‌కే రిజిస్ట‌ర్ చేసుకుని ఉంటే లాగిన్ అవ్వాలి.
  • Aadhaar Supervisor/Operator – District అనే పేరిట జాబ్‌ను వెద‌కాలి. అక్క‌డ డిస్ట్రిక్ట్ బ‌దులు అభ్య‌ర్థులు త‌మ‌కు కావ‌ల్సిన జిల్లా లేదా రాష్ట్రం పేరు ఇవ్వ‌వ‌చ్చు.
  • ఉద్యోగ వివ‌రాలు, అర్హ‌త‌లు, ఇత‌ర స‌మాచారాన్ని క్షుణ్ణంగా చ‌ద‌వాలి.
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను స‌రిగ్గా నింపాలి.
  • విద్యార్హ‌త‌ల‌కు చెందిన స‌ర్టిఫికెట్ల‌ను అప్‌లోడ్ చేయాలి.
  • ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజ‌ర్ స‌ర్టిఫికెట్‌ను క‌చ్చితంగా జ‌త చేయాలి.
  • ఐడీ, అడ్ర‌స్ ప్రూఫ్ ప‌త్రాల‌ను కూడా అప్‌లోడ్ చేయాలి.
  • వివ‌రాల‌ను అన్నింటినీ పూర్తిగా నింపిన త‌రువాత స‌బ్‌మిట్ నొక్కాలి.
  • అనంత‌రం వ‌చ్చే రిఫ‌రెన్స్ లేదా అక్‌నాలెడ్జ్‌మెంట్ ఫామ్‌ను భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

ఈ ఉద్యోగాల‌కు అభ్య‌ర్థులు కేవ‌లం ఆన్ లైన్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌రు.

గ‌మనిక: అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేష‌న్‌ను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి స‌మాచారాన్ని ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. అధికారిక సైట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే అప్‌డేట్స్‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ…

Saturday, 4 April 2026, 8:07 PM

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి…

Saturday, 4 April 2026, 4:01 PM

‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!

పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం…

Saturday, 4 April 2026, 12:10 PM

హ్యాపీ బర్త్‌డే నా చిన్ని బాబు.. కుమారుడు అయాన్ పుట్టినరోజున అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని సోషల్ మీడియాలో…

Saturday, 4 April 2026, 10:26 AM

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM