Anchor Suma : విశ్వ‌క్ వ‌ర్సెస్ దేవి.. మ‌ధ్య‌లో న‌ష్ట‌పోయిన సుమ‌..!

May 7, 2022 1:20 PM

Anchor Suma : యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లితో వివాదం ఏమోగానీ విశ్వ‌క్‌సేన్‌కు ఈ విష‌యం బాగానే క‌ల‌సి వ‌చ్చింది. ఆయ‌న న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా గురించే చ‌ర్చంతా న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ వీకెండ్‌లో ఈ మూవీ మ‌రిన్ని వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మూవీ విడుద‌లైన రోజే పాటిజివ్ టాక్‌ను సాధించి దూసుకుపోతోంది. దీనికి తోడు మ‌రోవైపు దేవితో ఏర్ప‌డిన గొడ‌వ కార‌ణంగా చాలా మంది విశ్వ‌క్‌కు స‌పోర్ట్‌ను ఇస్తున్నారు. ఆయ‌న మూవీని చూసేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీంతో విశ్వ‌క్ హిట్ కొట్టాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే విశ్వ‌క్‌, దేవి గొడ‌వ ఏమోగానీ.. మ‌ధ్య‌లో యాంక‌ర్ సుమ బాగా న‌ష్ట‌పోయిన‌ట్లు తెలుస్తోంది.

Anchor Suma movie loss with Vishwak Sen and Devi Nagavalli quarrel
Anchor Suma

యాంక‌ర్ సుమ బుల్లితెర‌పై ఏవిధంగా సంద‌డి చేస్తుందో అంద‌రికీ తెలిసిందే. ఈమె సినిమా ఈవెంట్ల‌తోపాటు టీవీ షోల‌లోనూ పాల్గొంటూ అల‌రిస్తోంది. అయితే చాలా ఏళ్ల త‌రువాత జ‌య‌మ్మ పంచాయితీ అనే మూవీతో ఈమె వెండితెర‌పై అల‌రించేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ కూడా శుక్ర‌వార‌మే రిలీజ్ అయింది. కానీ ఈమె సినిమా గురించి ప‌ట్టించుకునే వారు క‌రువ‌య్యారు. సినిమా క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు చాలా మంది విశ్వ‌క్ సినిమా వైపు మొగ్గు చూపారు. కార‌ణం.. ఆయ‌నను దేవి తిట్ట‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. వారి గొడ‌వ కార‌ణంగా విశ్వ‌క్‌కు బాగానే సానుభూతి ల‌భించింది. దీంతో అది ఆయ‌న సినిమాకు ప్ల‌స్ అయింది. ఫ‌లితంగా అశోక‌వ‌నంలో మూవీని ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా చూస్తున్నారు. దీంతో సుమ జ‌య‌మ్మ పంచాయితీ మూవీని చూసేందుకు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. ఫ‌లితంగా సుమ‌కు ఎక్కువ‌గానే న‌ష్టం జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక శుక్ర‌వారం ఇంకో మూవీ రిలీజ్ అయింది. శ్రీ‌విష్ణు న‌టించిన భ‌ళా తంద‌నాన కూడా వ‌చ్చింది. అయితే సుమ సినిమా గురించైనా అంతో ఇంతో మాట్లాడుకున్నారు. కానీ ఈ మూవీనైతే అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ మూవీ వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌లేదు. ఏది ఏమైనా విశ్వ‌క్‌కు త‌న గొడ‌వ క‌ల‌సి వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. వీకెండ్ లో ఈ మూవీకి దాదాపుగా ఏవీ పోటీలేవు. క‌నుక విశ్వ‌క్ సినిమా ఇంకా ఎక్కువ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment