Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సీనియర్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటీవల వాపోయిన అనసూయ తాజాగా ఓ సంచలన ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ.. అనసూయ భరద్వాజ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విషయంలో చేలరేగిన వివాదం మళ్లీ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ – అనసూయ భరద్వాజ్ మధ్య సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్ జరిగింది.
సినిమా ప్రమోషనల్ స్టైల్ నచ్చకపోవడంతో అప్పట్లో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండను, సినిమాలో అసభ్యతను టార్గెట్ చేసి విమర్శించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా ఆమెకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అయితే అర్జున్ రెడ్డి విడుదలై ఇప్పటికి 5 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు అదే రోజున లైగర్ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే లైగర్ మూవీకి మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో పూరీని, విజయ్ ని ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లైగర్ విషయంలో ఇంత వరెస్టు రిజల్ట్‌ను ఎవరూ ఊహించలేదు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి ఇది ఊహించని షాక్. ఈ నేపథ్యంలో అనసూయ లైగర్ సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored అని ట్వీట్ చేసింది. అసలే సినిమా దొబ్బిందని ఫ్రాస్ట్రేషన్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను బూతులు తిడుతున్నారు. మరికొందరైతే ఆర్టికల్ లో రాయలేని విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు చూస్తే మీకే అర్థమవుతుంది. దీనిపై విజయ్ స్పందిస్తాడో లేక ఇంతకు ముందులాగే టైం కోసం వైట్ చేసి పరోక్షంగా కౌంటర్లు వేస్తాడో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…