RRR : ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

RRR : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికినా చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే ? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఇదే కోరుకుంటారు.

ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో జక్కన్న తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిన విషయమే. అయితే వీరికంటే ముందు రాజమౌళి పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వలన వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట. మరీ ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం..

RRR

సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను జక్కన్న సంప్రదించగా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారని టాక్. ఆ తర్వాత పరిణీతి చోప్రాను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో.. ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. చివరికి సీత పాత్రలో ఆలియా భట్ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మరోవైపు ఎన్టీఆర్‌కు జోడీగా మొదటగా అమీ జాక్సన్‌ను జక్కన్న సంప్రదించార‌ట‌. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్ కైఫ్‌ను కూడా సంప్రదించగా.. ఆమె కూడా అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా షూట్ మొదలైన కొద్ది రోజులకే ఆమె కూడా తప్పుకుంది. దీనితో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది. ఎన్టీఆర్ కు జోడీగా మోరిస్ సెట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM