Anasuya : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై అన‌సూయ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్‌.. బండ‌బూతులు తిడుతున్న విజయ్ ఫ్యాన్స్‌..

August 26, 2022 9:14 AM

Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సీనియర్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చేసిన తాజా ట్వీట్ కలకలం రేపుతోంది. సోషల్‌ మీడియాలో తను ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని రాజకీయం చేస్తున్నారంటూ ఇటీవల వాపోయిన అనసూయ తాజాగా ఓ సంచలన ట్వీట్‌ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మ‌ధ్య అర్జున్ రెడ్డి సినిమా విష‌యంలో చేల‌రేగిన వివాదం మళ్లీ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ – అనసూయ భరద్వాజ్ మధ్య సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్ జరిగింది.

సినిమా ప్రమోషనల్ స్టైల్ నచ్చకపోవడంతో అప్పట్లో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండను, సినిమాలో అసభ్యతను టార్గెట్ చేసి విమర్శించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా పరోక్షంగా ఆమెకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఈ వివాదం చాలా దూరం వెళ్ళింది. అయితే అర్జున్ రెడ్డి విడుద‌లై ఇప్ప‌టికి 5 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు అదే రోజున లైగ‌ర్ సినిమా థియేట‌ర్స్‌లోకి వ‌చ్చింది. అయితే లైగ‌ర్ మూవీకి మార్నింగ్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో పూరీని, విజయ్ ని ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. లైగ‌ర్ విషయంలో ఇంత వరెస్టు రిజ‌ల్ట్‌ను ఎవ‌రూ ఊహించ‌లేదు.

Anasuya indirect comments Vijay Devarakonda fans react
Anasuya

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి ఇది ఊహించని షాక్. ఈ నేప‌థ్యంలో అన‌సూయ లైగ‌ర్ సినిమా పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored అని ట్వీట్ చేసింది. అస‌లే సినిమా దొబ్బిందని ఫ్రాస్ట్రేషన్ లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ అన‌సూయ‌ను బూతులు తిడుతున్నారు. మరికొందరైతే ఆర్టికల్ లో రాయలేని విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు చూస్తే మీకే అర్థమవుతుంది. దీనిపై విజయ్ స్పందిస్తాడో లేక ఇంతకు ముందులాగే టైం కోసం వైట్ చేసి పరోక్షంగా కౌంటర్లు వేస్తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment