Vikrant Rona : కన్నడ హీరో సుదీప్ కెరీర్ లో మొదటి సారిగా రూ.95 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, మళయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మూవీ విక్రాంత్ రోణా. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా గత నెల జూలై 28న రిలీజ్ అయ్యింది. ఇక కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా నటించగా అనూప్ భండారి దర్శకత్వంలో వచ్చిన 3వ చిత్రం ఇది. విడుదలకు ముందే ఈ సినిమాలోని రా రా రక్కమ్మ పాట సూపర్ హిట్ గా నిలిచింది. దేశమంతటా విపరీతంగా ప్రచారం చేశారు.
అయితే ఈ సినిమాపై విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. రూ.95 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.210 కోట్లు వసూలు చేసిందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 5 వారాల తరువాత ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 2 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ చిత్రం ప్రసారం కానుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ సెప్టెంబర్ 2న జీ5 ఓటీటీలో విడుదల ఖరారైనట్లే భావించవచ్చు.
విక్రాంత్ రోణా మూవీ గొప్ప నిర్మాణ విలువలతో, అద్భుతమైన గ్రాఫిక్స్ తో, మంచి యాక్షన్ సన్నివేశాలతో రూపొందించబడింది. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక పాత్రలో నటించిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇక ఓటీటీలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…