రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్ లేకుండానే రైల్లో ఎక్కే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) కనిపించగానే చాలామందికి భయం మొదలవుతుంది. ఎంత ఫైన్ వేస్తారు?, రైలు నుంచి దింపేస్తారా?, దురుసుగా ప్రవర్తిస్తారా? వంటి ఆందోళనలు కలుగుతాయి. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. టీటీఈ తనకు నచ్చినట్లు ప్రవర్తించడానికి అవకాశం లేదు. మీరు మీ హక్కులు తెలుసుకుంటే, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా వ్యవహరించవచ్చు.
టికెట్ లేకపోయినా, లేదా తప్పు టికెట్ ఉన్నా, టీటీఈ మిమ్మల్ని నేరస్థుడిలా చూడకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం, నిర్ణీత ఛార్జీతో పాటు పెనాల్టీ వసూలు చేసి సరైన టికెట్ జారీ చేయాలి. అందుకు సంబంధించిన రసీదు ఇవ్వడం తప్పనిసరి. ఇష్టారాజ్యంగా డబ్బులు అడగడం, రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిషేధం. అలాగే ప్రయాణికులతో దురుసుగా మాట్లాడడం, బెదిరించడం, అవమానించడం టీటీఈకి అనుమతి లేదు. నిబంధనలను వివరించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడమే అతని బాధ్యత.
వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ బోగీలో కూర్చుంటే, సీట్లు లేని పక్షంలో జనరల్ బోగీకి వెళ్లమని సూచించవచ్చు. కానీ నిబంధనల ప్రకారం అవసరం లేకుండా రైలు నుంచి వెంటనే దింపేయడం సాధ్యం కాదు. మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో టీటీఈ మరింత సంయమనంతో, మానవీయంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
పెనాల్టీ విధించే ముందు, ఏ నిబంధన ప్రకారం ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో టీటీఈ స్పష్టంగా చెప్పాలి. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అతనికి లేదు. అన్యాయం జరుగుతోందని అనిపిస్తే, అదనంగా డబ్బులు అడిగితే, లేదా బెదిరిస్తే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సులభమైన ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముఖ్య గమనిక: రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం, అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నియమాలను పాటించాలి.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…