Vikrant Rona : ఓటీటీలో విక్రాంత్ రోణా.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

August 26, 2022 7:32 AM

Vikrant Rona : క‌న్న‌డ హీరో సుదీప్ కెరీర్ లో మొద‌టి సారిగా రూ.95 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు, హిందీ, మ‌ళ‌యాళ‌ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన మూవీ విక్రాంత్ రోణా. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌త నెల జూలై 28న రిలీజ్ అయ్యింది. ఇక క‌న్న‌డ సూప‌ర్ స్టార్ కిచ్చ సుదీప్‌ హీరోగా న‌టించ‌గా అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన 3వ చిత్రం ఇది. విడుద‌ల‌కు ముందే ఈ సినిమాలోని రా రా ర‌క్క‌మ్మ పాట సూప‌ర్ హిట్ గా నిలిచింది. దేశ‌మంత‌టా విప‌రీతంగా ప్ర‌చారం చేశారు.

అయితే ఈ సినిమాపై విమ‌ర్శ‌కుల నుండి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రూ.95 కోట్ల బ‌డ్జెట్ తో తీసిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ.210 కోట్లు వ‌సూలు చేసింద‌ని అంచ‌నా. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన 5 వారాల త‌రువాత ఓటీటీలోకి రానుంది. సెప్టెంబ‌ర్ 2 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ చిత్రం ప్ర‌సారం కానుందని స‌మాచారం. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌క పోయిన‌ప్ప‌టికీ సెప్టెంబ‌ర్ 2న జీ5 ఓటీటీలో విడుద‌ల ఖ‌రారైన‌ట్లే భావించ‌వ‌చ్చు.

Vikrant Rona to release on OTT know the details
Vikrant Rona

విక్రాంత్ రోణా మూవీ గొప్ప‌ నిర్మాణ విలువ‌ల‌తో, అద్భుత‌మైన గ్రాఫిక్స్ తో, మంచి యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించ‌బ‌డింది. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన ఐట‌మ్ సాంగ్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఇక ఓటీటీలో ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment