
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 418 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి కీలక హోదాలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు bankofbaroda.bank.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 19, 2026.
ఐటీ నిపుణులకు అవకాశాలు..
ఈ నియామక డ్రైవ్ ప్రధానంగా ఐటీ రంగంలో అనుభవం ఉన్న నిపుణులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
అర్హతలు..
- ఆఫీసర్ పోస్టులు: కనీసం ఒక సంవత్సరం సంబంధిత ఐటీ అనుభవం తప్పనిసరి
- మేనేజర్ పోస్టులు: కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం
- సీనియర్ మేనేజర్ పోస్టులు: కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి
- గమనిక: అనుభవం అర్హత (qualification) పూర్తయ్యాక పొందినదై ఉండాలి.
జీతభత్యాలు
- ఆఫీసర్లు – JMG స్కేల్-I
- మేనేజర్లు – MMG స్కేల్-II
- సీనియర్ మేనేజర్లు – MMG స్కేల్-III
- ఇవన్నీ కాకుండా, బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
దరఖాస్తు విధానం
- bankofbaroda.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- Careers / Current Opportunities విభాగంలోకి వెళ్లండి
- IT Manager Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి
- ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వండి / లాగిన్ అవ్వండి
- ఆన్లైన్ దరఖాస్తు ఫామ్‌ను జాగ్రత్తగా పూరించండి
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి
- దరఖాస్తును సమర్పించి, కన్ఫర్మేషన్ కాపీని భద్రపరుచుకోండి
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికకు ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని బ్యాంక్ సూచించింది. ఐటీ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలి. అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ను మాత్రమే సంప్రదించాలి.








