Anasuya In Godfather : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో థియేటర్స్ వద్ద కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించారు.
ఇక గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా ఈ చిత్రంలో ఒక పాత్రలో నటించింది. గాడ్ ఫాదర్ లో అనసూయ నటించిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. అనసూయ ఏ చిత్రంలో నటించినా.. ఆ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ అనసూయ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో ఓ నెటిజన్ ఈ విషయంలో అనసూయని ప్రశ్నించాడు. గాడ్ ఫాదర్ లో మీ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. కానీ ఎందుకు మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా పాల్గొనలేదు అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. థ్యాంక్స్ అండీ.. మీరు నమ్మాలి.. చాలా షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నా అని బదులిచ్చింది.
అంటే.. అనసూయ ఇతర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్లే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఈమెది చిన్న రోల్. కనుక ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదని కూడా కొందరు అంటున్నారు. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మళయాళంలో విజయం అందుకున్న లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు మోహన్ రాజా ఆ కథని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చి ప్రేక్షకులని మెప్పించారు. ఈ చిత్రంలో చిరంజీవికి పోటీగా సత్యదేవ్, నయనతార నటన ఎంతో అద్భుతంగా ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…