Jajikaya : మనం కొన్ని రకాల వంటల తయారీలో జాజికాయను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దీనిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జాజికాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పూర్వకాలంలో ప్రతి వంటింట్లో జాజికాయ తప్పకుండా ఉండేది. మనకు వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జాజికాయను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జాజికాయ చేదు, వగరు రుచులను కలిగి ఉంటుంది. దీనిని నుండి నూనెను కూడా తయారు చేస్తారు. జాజికాయ చక్కని సువాసనను కలిగి ఉంటుంది. జాజికాయ వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వాత, కఫ రోగాలను నయం చేయడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి పూతను, ఉబ్బు రోగాన్ని, క్రిమి రోగాన్ని తగ్గించడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. జాజికాయను పాలతో అరగదీసి ఆ గంధాన్ని పై పూతగా రాయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. మలేరియా జ్వరాన్ని తగ్గించడంలో కూడా జాజికాయ ఉపయోగపడుతుంది. మలేరియా జ్వరంతో బాధపడే వారు ఉదయం పరగడుపున 10 గ్రా. ల పటిక బెల్లాన్ని చప్పరించి, ఆ తరువాత 2 గ్రా. జాజికాయ కొద్ది కొద్దిగా నములుతూ మింగాలి. ఇలా చేసిన అర గంట వరకు ఏమీ తినకూడదు. ఇలా చేయడం వల్ల మలేరియా జ్వరం తగ్గుతుంది.
జాజికాయను ఆవు నెయ్యితో అరగదీసి ఆ గంధాన్ని కంటిరెప్పలపై రాసి పడుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. జాజికాయను బియ్యం కలిపిన నీటితో అరగదీసి ఆ గంధాన్ని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో అదే బియ్యం కడిగిన నీటితో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. జాజికాయ పొడిని, ఆవు నెయ్యితో కలిపి పై పూతగా రాయడం వల్ల పుండ్లు తగ్గుతాయి. జాజికాయను, అక్కలకర్రను, జాపత్రిని, చిన్న యాలకులను, లవంగాలు, నాగకేసరాలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని దంచి పొడి చేసుకోవాలి. దీనిలో 3 గ్రా. పచ్చకర్పూరాన్ని కలిపి ఆ మొత్తం చూర్ణాన్ని తమలపాకు రసంతో కలిపి నూరి శనగ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నీడకు ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు రెండు లేదా మూడు పూటలా కండచక్కెరతో కలిపి తీసుకున్న తరువాత పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతిని సంతరించుకుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల పురుషులల్లో వీర్య వృద్ధి, వీర్య స్తంభన కలుగుతుంది.
5 లేదా 6 చిటికెల జాజికాయ పొడిని మేక పాలతో అరగదీసి ఆ గంధాన్ని అర కప్పు మేక పాలతో కలిపి తీసుకుంటే గర్భస్రావం కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడిని, పసుపును, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పెదవులపై లేపనంగా రాస్తూ ఉంటే పెదవుల పగుళ్లు తగ్గుతాయి. జాజికాయ పొడిని, దోరగా వేయించిన చలువ మిరియాల పొడిని సమపాళ్లలో కలిపి నిల్వ చేసుకోవాలి. దీంతో రోజూ దంతాలను శుభ్రం చేసుకుంటే కదిలే దంతాలు గట్టిపడతాయి.
జాజికాయల పొడి 10 గ్రాములు, హారతి కర్పూరం పొడి 2 గ్రాములు, పుదీనా పువ్వు ఒక గ్రాము, వాము పువ్వు అర గ్రాము మోతాదులో తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పూటకు ఒక గ్రాము మోతాదులో మంచి నీటితో కలిపి మూడు పూటలా తీసుకుంటే తలనొప్పి, జలుబు వంటివి తగ్గుతాయి. జాజికాయను మంచి నీటితో కలిపి అరగదీసి ఆ గంధాన్ని నుదుటిపై రాయడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. ఈ విధంగా జాజికాయను ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని, దీనిని తప్పకుండా వంటగదిలో ఉంచుకోవాలని.. నిపుణులు తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…