Ali Basha : మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చాలా సరదాగా ఉంటారని అందరికీ తెలుసు. ఎన్నో ఇంటర్య్వూలు, ఫంక్షన్లలో కూడా ఆయన జోకులు వేస్తూ ఉండడం చూస్తూనే ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ చిత్ర యూనిట్ తో జరిగిన షో లో కూడా ఆయన చాలా ఫన్నీగా ఉండడం కనిపించింది. కానీ అలీతో సరదాగా అనే షో లోని తాజాగా రానున్న ఎపిసోడ్ లో మాత్రం ఆయన తన సహనం కోల్పోయినట్టుగా కనిపించారు.
రీసెంట్ గా అల్లు ఫ్యామిలీ తమ సినీ స్టూడియోని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో అల్లు రామలింగయ్యతో కలిసి నటించిన పలువురు నటీనటులతోపాటు కామెడీ క తమ వంతు కృషి చేసిన నటులను అల్లు ఫ్యామిలీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఇందులో ఆయన తమ కుటుంబ విషయాల గురించి, తన మనవళ్లు, మనవరాళ్ల గురించి సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో అలీ ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ మరియు చిరు ఫ్యామిలీల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అని ఆయనను అడిగాడు.
దీనికి సమాధానంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తనని ఈ షో కి పిలిచినప్పుడు ఎటువంటి వివాదాస్పదమైన ప్రశ్నలు అడగమన్నారు కానీ సర్ ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయని చెప్పారని అంటూ ఇదిప్పుడు సర్ ప్రైజింగ్ ప్రశ్నా ? అని ఆలీని అడిగారు. ఆ తరువాత దీనిపై అల్లు అరవింద్ హర్ట్ అయి షో నుండి వెళ్లిపోయే పరిస్థితి వచ్చినట్టుగా చూపించారు. అయితే ఈ విషయంపై ఇప్పుడే ఇంకా ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. జనాలను ఆకర్షించడానికి ఇలా టీజర్లను ఎడిట్ చేస్తారని అంతేగానీ వారు చూపించినట్టుగా నిజంగా జరగదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
కానీ గత కొంత కాలంగా మెగా, అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ లు జరుగుతున్నాయి. ఇవన్నీ వారి కుటుంబాల మధ్య సఖ్యత లేదని అనుకోవడానికి పుకార్లు రావడానికి కారణమవుతున్నాయి. ఇక పూర్తి ఎపిసోడ్ చూస్తే గానీ ఈ విషయంపై అల్లు అరవింద్ ఏం మాట్లాడారో స్పష్టత రాదని కొందరు అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…