Keerthi Chawla : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించాలంటే అందంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం లేకపోతే కొన్ని సినిమాలలో నటించిన తర్వాత కనుమరుగయ్యి పోవాల్సిందే. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్ అందుకున్న హీరోయిన్స్ సైతం తర్వాత కాలంలో సినిమా కథలలో సరైన కంటెంట్ ని ఎంచుకోలేక చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఈ కోవకు చెందిన హీరోయిన్స్ లో ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించిన కీర్తి చావ్లా కూడా ఉన్నారు. తొలి చిత్రంతోనే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ కీర్తి చావ్లా. కీర్తి చావ్లా అనే పేరు ఇప్పటి వారికి అంతగా తెలియకపోవచ్చు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి చావ్లా. ఆది చిత్రంలో చబ్బి లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న కీర్తి చావ్లా స్టార్ స్టేటస్ ను ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది. చిత్ర కథ సెలక్షన్ లో తప్పులు చేసి వరుస పరాజయాలను అందుకుంటూ త్వరగా ఫేడవుట్ అయిపోయింది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించినా కూడా ఆవిడ మంచి గుర్తింపు అనేది సాధించుకోలేకపోయింది. కానీ ప్రస్తుతం కీర్తిచావ్లాకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కన్నా ఇప్పుడు మరింత గ్లామరస్ లుక్ తో కనిపిస్తుంది కీర్తి చావ్లా. తమిళంలో కూడా తొలిచిత్రం ఆనై తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. కానీ తమిళ్ లో కూడా హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక సినిమా ఆఫర్స్ తగ్గిపోయిన తర్వాత కీర్తి చావ్లా అప్పుల పాలైనట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు సమాచారం వినిపిస్తుంది. మొదటి చిత్రం ఆదితోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి చావ్లా ప్రస్తుతం చూడ్డానికి కాస్త బొద్దుగా, ముద్దుగా తయారయింది. అయితే ఇప్పటికీ కీర్తి చాలా పెళ్లి చేసుకుందా లేక రిలేషన్‌షిప్ లో ఉందా.. అనే విషయం మాత్రం గోప్యంగానే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…