Baahubali : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. బాహుబలి నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేశాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. అయినప్పటికీ కథ చెప్పడం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే జక్కన్న తీసిన మర్యాద రామన్న, ఈగ వంటి సినిమాలను బట్టి అతను ఎలాంటి సినిమాలనైనా సులువుగా తీయగలడని మనం గ్రహించవచ్చు.
అలాగే బాహుబలి చూసిన తర్వాత అతని విజన్ మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీకి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ దెబ్బతో డైరెక్టర్ రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు.
ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 తో వీరి క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాహుబలి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సన్నివేశం అందరికీ గుర్తుండిపోయేలా చిత్రీకరించాడు జక్కన్న. అయితే ఇప్పుడు బాహుబలి 3 కూడా ఉంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాహుబలి చిత్రం బృందం మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ తప్పకుండా బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నాయని జక్కన్న పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక బాహుబలి 3 త్వరలోనే పట్టాలెక్కనుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో బాహుబలి 3 వస్తే బాగుండు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…