Anasuya In Godfather : గాడ్ ఫాద‌ర్ ప్ర‌మోష‌న్స్‌కు అన‌సూయ డుమ్మా.. కార‌ణం ఏంటో చెప్పేసింది..!

October 7, 2022 12:33 PM

Anasuya In Godfather : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ విజయదశమి కానుకగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్  రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో థియేటర్స్ వద్ద కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించారు.

ఇక గ్లామర‌స్‌ యాంకర్ అనసూయ కూడా ఈ చిత్రంలో ఒక పాత్రలో నటించింది. గాడ్ ఫాదర్ లో అనసూయ నటించిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. అనసూయ ఏ చిత్రంలో నటించినా.. ఆ మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ అనసూయ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం.  గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో ఓ నెటిజన్ ఈ విషయంలో అనసూయని ప్రశ్నించాడు. గాడ్ ఫాదర్ లో మీ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. కానీ ఎందుకు మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా పాల్గొనలేదు అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. థ్యాంక్స్ అండీ.. మీరు నమ్మాలి.. చాలా షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నా అని బదులిచ్చింది.

Anasuya In Godfather she has not done promotions told the reason
Anasuya In Godfather

అంటే.. అన‌సూయ ఇత‌ర చిత్రాల షూటింగ్‌ల‌తో బిజీగా ఉండడం వ‌ల్లే గాడ్ ఫాద‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌లేద‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఈమెది చిన్న రోల్‌. క‌నుక ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మళ‌యాళంలో విజయం అందుకున్న లూసిఫ‌ర్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు మోహన్ రాజా ఆ కథని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చి ప్రేక్షకులని మెప్పించారు. ఈ చిత్రంలో చిరంజీవికి పోటీగా సత్యదేవ్, నయనతార నటన ఎంతో అద్భుతంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now