5G Phones List : ఎయిర్‌టెల్ 5జి సేవ‌లు ల‌భిస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా.. లేదా.. చెక్ చేసుకోండి..!

5G Phones List : ప్ర‌ముఖ టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ ఈమ‌ధ్యే 5జి సేవ‌ల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో మొత్తం 8 న‌గ‌రాల్లో ఎయిర్‌టెల్ 5జి సేవ‌ల‌ను మొద‌లు పెట్టింది. ఆ న‌గ‌రాల్లో హైద‌రాబాద్ కూడా ఉంది. ఇక 5జి అందుబాటులో ఉన్న ఫోన్లు ఇప్ప‌టికే మార్కెట్‌లో చాలా ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌మ 5జి సేవ‌లు ల‌భిస్తున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఎయిర్‌టెల్ విడుద‌ల చేసింది. ఈ లిస్ట్ చూసి మీ ఫోన్ 5జి ని స‌పోర్ట్ చేస్తుందో లేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో ఒక్క‌సారి చెక్ చేసుకోండి. ఇక ఆ లిస్ట్ విష‌యానికి వ‌స్తే..

యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 ఆ త‌రువాత వ‌చ్చిన ఐఫోన్లు అన్నింటిలోనూ 5జి అందుబాటులో ఉంది. క‌నుక ఈ ఫోన్లు ఉన్న ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక శాంసంగ్‌లో గెలాక్సీ ఎ53, ఎ33, ఎస్‌21 ఎఫ్ఈ, ఎస్‌22, 22ప్ల‌స్‌, 22 అల్ట్రా, ఎం33, జ‌డ్ ఫ్లిప్ 4, జ‌డ్ ఫోల్డ్ 4, నోట్ 20 అల్ట్రా ఫోన్ల‌లో 5జి ఉంది. అలాగే ఎస్‌21, ఎస్‌21 ప్ల‌స్‌, ఎస్‌21 అల్ట్రా, జ‌డ్ ఫోల్డ్ 2, ఎఫ్‌42, ఎ52ఎస్‌, ఎం52, జడ్ ఫ్లిప్ 3, జ‌డ్ ఫోల్డ్ 3, ఎ22, ఎస్‌20 ఎఫ్ఈ, ఎం32, ఎఫ్‌23, ఎ73, ఎం42, ఎం53, ఎం13 ఫోన్ల‌లోనూ 5జి ల‌భిస్తుంది.

5G Phones List

షియోమీ, రెడ్‌మీ, పోకోల‌కు చెందిన ఎంఐ10, 10ఐ, 10టి, 10టి ప్రొ, ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11ఎక్స్ ప్రొ, ఎంఐ11ఎక్స్‌, పోకో ఎం3 ప్రొ, పోకో ఎఫ్3, ఎంఐ11 లైట్ ఎన్ఈ, రెడ్‌మీ నోట్ 11టి, షియోమీ 11టి ప్రొ, షియోమీ కె16, షియోమీ 11ఐ హైప‌ర్ చార్జ్‌, రెడ్‌మీ నోట్ 10టి, నోట్ 11 ప్రొ ప్ల‌స్‌, పోకో ఎం4, ఎం4 ప్రొ, షియోమీ 12 ప్రొ, ఎంఐ11ఐ, రెడ్‌మీ 11 ప్రైమ్‌, పోకో ఎఫ్4, పోకో ఎక్స్‌4 ప్రొ, రెడ్‌మీ కె50ఐ ఫోన్ల‌లోనూ 5జిని పొంద‌వ‌చ్చు. అలాగే రియ‌ల్‌మికి చెందిన 8ఎస్‌, ఎక్స్‌7 మ్యాక్స్‌, నార్జో 30 ప్రొ, ఎక్స్‌7, ఎక్స్‌7 ప్రొ, 8, ఎక్స్‌50 ప్రొ, రియ‌ల్‌మి జిటి, జిటి మాస్ట‌ర్ ఎడిష‌న్‌, జిటి నియో2, రియ‌ల్‌మి 9, 9 ప్రొ, 9 ప్రొ ప్ల‌స్‌, నార్జో 30, రియ‌ల్‌మి 9 స్పీడ్ ఎడిష‌న్‌, రియ‌ల్‌మి జిటి2, జిటి2 ప్రొ, జిటి నియో 3, నార్జో 50, నార్జో 50 ప్రొ.. ఫోన్ల‌లోనూ 5జి వ‌స్తుంది.

అలాగే వ‌న్‌ప్ల‌స్‌లో నార్డ్‌, 9, 9 ప్రొ, నార్డ్ సీఈ, సీఈ2, వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ, నార్డ్ సీఈ2 లైట్‌, 10ఆర్‌, నార్డ్ 2టి, 10టి, వ‌న్‌ప్ల‌స్ 8, 8టి, 8 ప్రొ, 9 ఆర్టీ, నార్డ్ 2, 9ఆర్ ఫోన్ల‌లో కూడా 5జి ల‌భిస్తుంది. ఒప్పోలో రెనో ప్రొ, రెనో 6, 6 ప్రొ, ఎఫ్‌19 ప్రొ ప్ల‌స్‌, ఒప్పో ఎ53ఎస్‌, ఎ74, రెనో 7 ప్రొ, ఎఫ్‌21 ప్రొ, రెనో 7, రెనో 8, రెనో 8 ప్రొ, కె10, ఒప్పో ఎఫ్‌21ఎస్ ప్రొల‌లో, ఒప్పో ఫైండ్ ఎక్స్‌2లో కూడా 5జి వ‌స్తుంది. వివో, ఐక్యూల‌లో ఐక్యూ 3, వివో ఎక్స్‌50 ప్రొ, వి20 ప్రొ, ఎక్స్‌60 ప్రొ ప్ల‌స్‌, ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రొ, ఐక్యూ7, 7 లెజెండ్‌, వి21, ఐక్యూ జ‌డ్‌3, వి21ఇ, ఎక్స్‌70 ప్రొ, ప్రొ ప్ల‌స్‌, ఐక్యూ జ‌డ్‌5, వివో వై72, వి23, వి23 ప్రొ, వి23ఇ, టి1, వై75, ఐక్యూ 9 ప్రొ, ఐక్యూ 9, ఐక్యూ 9ఎస్ఈ, వివో టి1 ప్రొ, ఐక్యూ జ‌డ్‌6, ఎక్స్‌80, ఎక్స్‌80 ప్రొ, ఐక్యూ 9టి, వి25, వి25 ప్రొ, వై55, వివో వై55ఎస్.. ఫోన్ల‌నూ ఎయిర్‌టెల్ 5జి సేవ‌ల‌ను వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

అయితే ఈ ఫోన్ల‌లో కొన్ని ఫోన్లు 5జి రెడీ కాగా.. వాటిని ఇప్ప‌టిక‌ప్పుడే 5జి కోసం వినియోగించుకోవ‌చ్చు. కానీ కొన్ని ఫోన్ల‌కు సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ద్వారా 5జి సేవ‌లు ల‌భ్యం కానున్నాయి. ఇక ఆయా కంపెనీల‌ను బ‌ట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎప్పుడు వ‌చ్చేది తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM