ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ కి పెట్టింది పేరు. ఆయన వస్త్రధారణ కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ఆయన జీవిత భాగస్వామి అయిన స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ స్టైల్ కి తగ్గట్టు ఆమె కూడా ఒక రేంజ్ లో స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆమె ఏ ఫోటో షేర్ చేసినా కూడా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారిపోతుంటుంది.
2011లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. మొదటి నుంచి ఈ జంట ఏ ఫంక్షన్ లలోనైనా తళుక్కుమని మెరుస్తూ అందరి చూపులను ఆకర్షిస్తున్నారు. అర్జున్, స్నేహ జంట స్టైలిష్ లుక్ లో కలర్ ఫుల్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ లైఫ్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాబిడ్డలతో ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు వెస్ట్రన్ వేర్ లోనూ, ఇటు సాంప్రదాయంగా శారీస్ లోనూ కనిపిస్తూ స్నేహ రెడ్డి.. అల్లుఅర్జున్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎంతో దగ్గరయ్యారు. స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజెన్స్ ను ఎంతగానో ఆకర్షించింది.
అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఫిట్ నెస్‌ను ఏం మెయింటైన్ చేస్తున్నారు అంటూ, బ్యూటిఫుల్ లుక్ మేడం అంటూ కామెంట్స్ తో తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఒకరేమో మైండ్ బ్లోయింగ్ అంటూ, మరొకరేమో వాట్ ఏ సూపర్ పిక్.. అంటూ పొగడ్తలతో సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…