మేడ‌మ్ లుక్ సూప‌ర్‌.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిపై ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు..

August 7, 2022 7:09 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ కి పెట్టింది పేరు. ఆయన వస్త్రధారణ కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ఆయన జీవిత భాగస్వామి అయిన‌ స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ స్టైల్ కి తగ్గట్టు ఆమె కూడా ఒక రేంజ్ లో స్టైలిష్ లుక్ ని  మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆమె ఏ ఫోటో షేర్ చేసినా కూడా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ గా మారిపోతుంటుంది.

2011లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట  వివాహబంధంతో ఒక్కటయ్యారు. మొదటి నుంచి ఈ జంట ఏ ఫంక్షన్ లలోనైనా తళుక్కుమని మెరుస్తూ అందరి చూపులను ఆకర్షిస్తున్నారు. అర్జున్, స్నేహ జంట స్టైలిష్ లుక్ లో కలర్ ఫుల్ గా  సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తుంటారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ లైఫ్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు భార్యాబిడ్డలతో ఫారిన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

allu arjun wife sneha reddy latest photos fans comments

స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఒక పిక్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. అటు వెస్ట్రన్ వేర్ లోనూ, ఇటు సాంప్రదాయంగా శారీస్ లోనూ కనిపిస్తూ స్నేహ రెడ్డి.. అల్లుఅర్జున్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎంతో దగ్గరయ్యారు. స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజెన్స్ ను  ఎంతగానో ఆకర్షించింది.

అయితే ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఫిట్ నెస్‌ను ఏం మెయింటైన్ చేస్తున్నారు అంటూ, బ్యూటిఫుల్ లుక్ మేడం అంటూ కామెంట్స్ తో తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఒకరేమో మైండ్ బ్లోయింగ్ అంటూ, మరొకరేమో వాట్ ఏ సూపర్ పిక్.. అంటూ పొగడ్తలతో సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now