Akhanda Movie : బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ మూవీ ఇటీవలే హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కాగా.. 24 గంటల్లోనే అత్యధిక సంఖ్యలో వ్యూస్ సాధించిన చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇక తాజాగా అఖండ సినిమాను ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఏకంగా అందరూ కలిసి హాట్ స్టార్‌లో చూడడం హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలందరూ కలసి హాట్ స్టార్‌లో అఖండ మూవీని చూశారు. గుంటూరు జిల్లా పరిధిలోని ఓ చిన్న గ్రామంలో స్థానికులందరూ కలసి ఈ మూవీని వీక్షించారు. అందుకు గాను ఓ ప్రొజెక్టర్‌ను, ప్రత్యేక తెరను, సౌండ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలా ఆ గ్రామ ప్రజలందరూ కలసి అఖండ మూవీని చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ వార్త కాస్తా వైరల్‌గా మారింది.
కాగా అఖండ మూవీ డిసెంబర్ 2న విడుదల కాగా.. ఇటీవలే హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు రూ.200 కోట్లను సాధించి నిర్మాతకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మరో వైపు అఖండ చిత్రం హిందీ వెర్షన్ రీమేక్ కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం పోటీ పడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…