Akhanda Movie : బాల‌కృష్ణ అఖండ‌నా మ‌జాకా..? గ్రామం మొత్తం క‌లిసి హాట్ స్టార్‌లో సినిమా చూశారు..!

January 25, 2022 1:46 PM

Akhanda Movie : బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ మూవీ ఇటీవ‌లే హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కాగా.. 24 గంట‌ల్లోనే అత్య‌ధిక సంఖ్య‌లో వ్యూస్ సాధించిన చిత్రంగా మ‌రో రికార్డును సొంతం చేసుకుంది. ఇక తాజాగా అఖండ సినిమాను ఓ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు ఏకంగా అంద‌రూ క‌లిసి హాట్ స్టార్‌లో చూడ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

Akhanda Movie  watched by whole villagers in guntur

ఏపీలోని ఓ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లంద‌రూ క‌ల‌సి హాట్ స్టార్‌లో అఖండ మూవీని చూశారు. గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఓ చిన్న గ్రామంలో స్థానికులంద‌రూ క‌ల‌సి ఈ మూవీని వీక్షించారు. అందుకు గాను ఓ ప్రొజెక్ట‌ర్‌ను, ప్ర‌త్యేక తెర‌ను, సౌండ్ సిస్ట‌మ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలా ఆ గ్రామ ప్ర‌జ‌లంద‌రూ క‌ల‌సి అఖండ మూవీని చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ వార్త కాస్తా వైర‌ల్‌గా మారింది.

కాగా అఖండ మూవీ డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాగా.. ఇటీవ‌లే హాట్ స్టార్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ మూవీ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.200 కోట్ల‌ను సాధించి నిర్మాత‌కు మంచి లాభాల‌ను తెచ్చి పెట్టింది. మ‌రో వైపు అఖండ చిత్రం హిందీ వెర్ష‌న్ రీమేక్ కోసం ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ సైతం పోటీ ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now