OTT : కరోనా ఏమోగానీ ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. వారం మారిందంటే చాలు.. ఈ వారం ఓటీటీలో ఏ మూవీలు విడుదలవుతున్నాయి ? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారంలో ఓటీటీ వేదికగా విడుదల కానున్న మూవీలు, వెబ్ సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహాలో జనవరి 28వ తేదీ నుంచి అర్జున ఫల్గుణ మూవీ స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు తేజ మర్ని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో పలు మూవీలు ఈవారం సందడి చేయనున్నాయి. జనవరి 26న మళయాళ చిత్రం బ్రో డాడీ స్ట్రీమింగ్ కానుండగా.. జనవరి 28 నుంచి హిందీ చిత్రం తడప్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే జనవరి 25వ తేదీ నుంచి ది ప్రామిస్ ల్యాండ్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. జనవరి 25 నుంచి ది గిల్డెడ్ ఏజ్ అనే సిరీస్ కూడా స్ట్రీమ్ కానుంది.
ఇక నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే.. జనవరి 25వ తేదీ నుంచి స్పోపియర్స్ అనే సిరీస్ ప్రసారం కానుండగా.. జనవరి 26 నుంచి ది సిన్నర్ సిరీస్ కొత్త సీజన్ ప్రసారం కానుంది. జనవరి 27 నుంచి ఫ్రేమ్డ్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. జనవరి 28 నుంచి ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ కొరియన్ సిరీస్, గెట్టింగ్ క్యూరియస్ విత్ జొనాథన్ వాన్‌నెస్ సిరీస్, హోమ్ టౌన్ అనే మూవీ, ఫెరియా అనే మూవీ స్ట్రీమ్ కానున్నాయి.
జీ5లో జనవరి 26 వ తేదీ నుంచి ఆహా అనే మళయాళ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. జనవరి 28 నుంచి పవిత్ర రిష్తా అనే హిందీ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
వూట్‌లో జనవరి 26 నుంచి బడవ రాస్కెల్ అనే కన్నడ మూవీని స్ట్రీమ్ చేస్తారు. ఈరోస్ నౌలో జనవరి 28వ తేదీ నుంచి బరున్ రాయ్ అండ్ ది క్లిఫ్ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…