OTT : ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న మూవీలు, సిరీస్ ఇవే..!

January 25, 2022 1:09 PM

OTT : క‌రోనా ఏమోగానీ ఓటీటీల‌కు ప్రేక్ష‌కులు బాగా అల‌వాటు ప‌డిపోయారు. వారం మారిందంటే చాలు.. ఈ వారం ఓటీటీలో ఏ మూవీలు విడుద‌ల‌వుతున్నాయి ? అంటూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారంలో ఓటీటీ వేదిక‌గా విడుద‌ల కానున్న మూవీలు, వెబ్ సిరీస్‌ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

this week OTT releasing movies and web series list

ఆహాలో జ‌న‌వ‌రి 28వ తేదీ నుంచి అర్జున ఫ‌ల్గుణ మూవీ స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో శ్రీ‌విష్ణు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు తేజ మ‌ర్ని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ప‌లు మూవీలు ఈవారం సంద‌డి చేయ‌నున్నాయి. జ‌న‌వ‌రి 26న మ‌ళ‌యాళ చిత్రం బ్రో డాడీ స్ట్రీమింగ్ కానుండ‌గా.. జ‌న‌వ‌రి 28 నుంచి హిందీ చిత్రం త‌డ‌ప్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే జ‌న‌వ‌రి 25వ తేదీ నుంచి ది ప్రామిస్ ల్యాండ్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. జ‌న‌వ‌రి 25 నుంచి ది గిల్డెడ్ ఏజ్ అనే సిరీస్ కూడా స్ట్రీమ్ కానుంది.

ఇక నెట్ ఫ్లిక్స్ విష‌యానికి వ‌స్తే.. జనవరి 25వ తేదీ నుంచి స్పోపియర్స్ అనే సిరీస్ ప్ర‌సారం కానుండ‌గా.. జ‌న‌వ‌రి 26 నుంచి ది సిన్న‌ర్ సిరీస్ కొత్త సీజ‌న్ ప్ర‌సారం కానుంది. జ‌న‌వ‌రి 27 నుంచి ఫ్రేమ్డ్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 28 నుంచి ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ కొరియ‌న్ సిరీస్‌, గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్ సిరీస్‌, హోమ్ టౌన్ అనే మూవీ, ఫెరియా అనే మూవీ స్ట్రీమ్ కానున్నాయి.

జీ5లో జనవరి 26 వ తేదీ నుంచి ఆహా అనే మ‌ళ‌యాళ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. జ‌న‌వ‌రి 28 నుంచి పవిత్ర రిష్తా అనే హిందీ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.

వూట్‌లో జ‌న‌వ‌రి 26 నుంచి బ‌డ‌వ రాస్కెల్ అనే క‌న్న‌డ మూవీని స్ట్రీమ్ చేస్తారు. ఈరోస్ నౌలో జనవరి 28వ తేదీ నుంచి బరున్‌ రాయ్‌ అండ్‌ ది క్లిఫ్ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now