శనివారం, జూలై 11, 2026
వార్తలు

Actress Rajani : మెట్టింట్లో నరకం అనుభవించిన నాటి హీరోయిన్ రజ‌నీ.. అత్తింటి వారు రజినీని ఇంత హింసించారా..?

Actress Rajani : శ్రీదేవి, జయప్రదల తర్వాత సహజ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రజినీ మాత్రమే. సీతారామ కళ్యాణం, రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట లలో రాజేంద్ర ప్రసాద్ సరసన, మజ్నులో…

Actress Rajani : మెట్టింట్లో నరకం అనుభవించిన నాటి హీరోయిన్ రజ‌నీ.. అత్తింటి వారు రజినీని ఇంత హింసించారా..?

Actress Rajani : శ్రీదేవి, జయప్రదల తర్వాత సహజ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రజినీ మాత్రమే. సీతారామ కళ్యాణం, రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట లలో రాజేంద్ర ప్రసాద్ సరసన, మజ్నులో నాగార్జున సరసన, సీతరాముల కళ్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. తెలుగులో నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకి మంచి గుర్తింపు లభించింది. అలాగే రాజేంద్రప్రసాద్ తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజినీ 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం రజినీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. రజినీ అసలు పేరు శశికళ అలాగే పూర్తి పేరు రజినీ పర్వర్.

బెంగుళూరులో పుట్టిన రజిని 1998లో వివాహం చేసుకుంది. ఈమెకు ముగ్గురు పిల్లలు జన్మించాక ఆ వివాహ బంధం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా జీవిస్తోంది. వాళ్ల పెళ్లి పెటాకులు కావడం పెద్ద వింత ఏమీ లేదు కానీ రజనీ జీవితంలో మాత్రం అనేక కష్టాలు ఉన్నాయట. ముల్లగిరి ప్రవీణ్ అనే ఒక ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న రజినీ తాను సినిమాల్లో సంపాదించిన డబ్బును అంతా కూడా భర్త దగ్గరే పెట్టిందట. అలాగే ముంబైలో ఒక అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసింది.

Actress Rajani told how her life changed after marriage
Actress Rajani

అయితే పెళ్ల‌య్యాక భర్త అలాగే అత్త డబ్బుల కోసం రజినీని బాగా ఇబ్బంది పెట్టారట. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేశారట. అంతేకాదు ఆమె కొనుక్కున్న అపార్ట్మెంట్ సైతం తన భర్త అతడి తల్లిపై రిజిస్ట్రేషన్ చేయించడంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయిందట. అంతేకాదు తనపై తప్పుడు కేసులు పెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసింది రజినీ. ఇప్పటికీ తనకు రావాల్సిన డబ్బుల కోసం.. అలాగే తన కష్టపడి సంపాదించిన డబ్బు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది రజినీ. చూడాలి రజనీకి ఎప్పుడు న్యాయం జరుగుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి