బుధవారం, జూలై 8, 2026
వార్తలు

Actress Laya : సంప్ర‌దాయ నాట్యంతో అద‌ర‌హో అనిపించిన ల‌య‌.. వీడియో వైర‌ల్‌..!

Actress Laya : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సినీ న‌టి ల‌య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. భ‌ద్రం కొడుకో అనే మూవీ…

Actress Laya : సంప్ర‌దాయ నాట్యంతో అద‌ర‌హో అనిపించిన ల‌య‌.. వీడియో వైర‌ల్‌..!

Actress Laya : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సినీ న‌టి ల‌య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. భ‌ద్రం కొడుకో అనే మూవీ ద్వారా 1992లో సినీ తెర‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత స్వ‌యంవ‌రం సినిమాతో ఈమెకు బాగా పేరు వ‌చ్చింది. దీంతో ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్టాయి. ఆ త‌రువాత మ‌నోహ‌రం, హ‌నుమాన్ జంక్ష‌న్‌, ప్రేమించు, పెళ్లాంతో ప‌నేంటి, మిస్స‌మ్మ వంటి చిత్రాల్లో న‌టించింది. ఇవ‌న్నీ ఈమెకు మంచి హిట్స్‌ను అందించాయి. అయితే 2006లో ఈమె పెళ్లి చేసుకున్న అనంత‌రం సినిమాల‌కు దూర‌మైంది. ప్ర‌స్తుతం ఈమె భ‌ర్త‌తో క‌ల‌సి అమెరికాలోనే ఉంటోంది.

అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ల‌య ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తోంది. గ‌తంలో స‌ర్కారు వారి పాట మూవీలోని క‌ళావ‌తి పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక తాజాగా మళ్లీ సంప్ర‌దాయ‌బ‌ద్ద‌మైన డ్యాన్స్ చేసి అల‌రించింది. ల‌య చేసిన డ్యాన్స్ ఎంతో అద్భుతంగా ఉండ‌డం విశేషం. ఈమె స్వ‌త‌హాగా నృత్య‌కారిణి. క‌నుక సంప్ర‌దాయ నాట్యం చేయ‌డం ఈమెకు వెన్న‌తో పెట్టిన విద్య అని చెప్ప‌వ‌చ్చు. అందులో భాగంగానే తాజాగా ఈమె ఓ పాట‌కు నాట్యం చేసి అల‌రించింది. ఆ వీడియోను ఈమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Actress Laya classical dance video viral
Actress Laya

ఇక తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ‌, మళయాళం భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టించింది. ఈమె చివ‌రి సారిగా 2018లో ర‌వితేజ సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనిలో న‌టించింది. హీరోయిన్ కు త‌ల్లి పాత్ర చేసింది. విజ‌య‌వాడకు చెందిన ఈమె తెలుగు హీరోయిన్‌గా ఎంతో మంచి గుర్తింపు సాధించింది. కూచిపూడి డ్యాన్స్ చేయ‌డంలో ల‌య దిట్ట అని చెప్ప‌వ‌చ్చు. ఈమె మ‌నోహ‌రం, ప్రేమించు చిత్రాల‌కు ఉత్త‌మ న‌టిగా వ‌రుస‌గా రెండు నంది అవార్డుల‌ను కూడా సాధించింది.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి