Actress Indraja : అలాంటివి మహిళల కన్నా పురుషులు ఎక్కువగా చేస్తున్నారు.. నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్!

March 11, 2022 8:50 PM

Actress Indraja: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన నటి ఇంద్రజ వివాహం అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి పలు బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేస్తోంది. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న ఇంద్రజ.. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న “స్టాండప్ రాహుల్” చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో రాజ్ తరుణ్ తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకులను ఇంద్రజ సందడి చేయనుంది.

Actress Indraja sensational comments about male actors
Actress Indraja

ఇక ఈ సినిమా ఈ నెల 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించాను. అయితే చాలా మంది మహిళలు తన భర్తలో లేని క్వాలిటీ తన కొడుకులో ఉండాలని ఆరాటపడుతారు. అందుకే పిల్లల పెంపకం విషయంలో ప్రతి తల్లి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుందని.. ఇంద్రజ తెలియజేసింది.

కానీ నేటి తరం యువత మాత్రం ఫ్యాషన్ వెంటపడుతూ ఫ్యాషన్ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఫ్యాషన్ రంగంలో స్థిరపడి జీవితంలో ముందుకు పయనిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇలాంటి కథాంశంతోనే నడుస్తుందని ఈమె తెలియజేసింది. అయితే ప్రస్తుత కాలంలో ఎన్నో కీలకమైన పాత్రలలో మహిళల కన్నా ఎక్కువగా పురుషులు మాత్రమే నటిస్తున్నారని, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా ఈమె తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment