మంగళవారం, జూలై 21, 2026
తెలంగాణ

నెల జీతం రూ.2 లక్షలు.. రూ.30 వేలకు ఆశపడ్డాడు.. చివరికి సస్పెండ్ అయ్యాడు!

సాధారణంగా చాలా మందికి నెలకు రూ.లక్షల్లో జీతం పొందుతున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం వారి వక్రబుద్ధి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అవినీతి శాఖ అధికారులకు దొరికి ఉద్యోగాలు కోల్పోతున్న ఘటనలను ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన…

నెల జీతం రూ.2 లక్షలు.. రూ.30 వేలకు ఆశపడ్డాడు.. చివరికి సస్పెండ్ అయ్యాడు!

సాధారణంగా చాలా మందికి నెలకు రూ.లక్షల్లో జీతం పొందుతున్నప్పటికీ కొంతమంది ప్రభుత్వ అధికారులు మాత్రం వారి వక్రబుద్ధి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అవినీతి శాఖ అధికారులకు దొరికి ఉద్యోగాలు కోల్పోతున్న ఘటనలను ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్‌ విద్యుత్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం..

acb arrested electricity ade for demanding bribe

ఇబ్రహీంబాగ్‌ విద్యుత్‌ సబ్‌డివిజన్‌లో చరణ్‌సింగ్‌ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మొయినాబాద్‌, శంకర్‌పల్లి, నార్సింగ్‌, ఇబ్రహీంబాగ్‌ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నందుకు చరణ్ సింగ్ నెలకు ఏకంగా 2 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నాడు. మణికొండకు చెందిన రవి అనే వ్యక్తి ఇదే శాఖలో చిన్నచిన్న కాంట్రాక్టు పనులను చేసేవాడు. ఈ క్రమంలోనే అందుకు అవసరమైన అనుమతి పత్రాన్ని ఇవ్వడం కోసం చరణ్ సింగ్ ఏకంగా అతన్ని లంచం అడిగాడు.

కాంట్రాక్టర్‌ రవి ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే అధికారుల సూచనల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం రవి రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. చరణ్‌ సింగ్‌కు డబ్బులు ఇస్తున్న క్రమంలో అవినీతి శాఖ అధికారులు దాడి చేసి అతనిని అరెస్టు చేసే.. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు  తరలించారు. అనంతరం జైలుకు పంపించినట్లు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి