lifestyle

Vamu Aaku : రోజూ 4 ఆకులు చాలు.. ర‌క్త‌నాళాలు క్లీన్ అవుతాయి, కిడ్నీ స్టోన్లు మాయ‌మ‌వుతాయి..!

Vamu Aaku : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔష‌ధ గుణాల గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో వాము ఆకు మొక్క కూడా ఒక‌టి. ఇది చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌దు. కానీ ఇది అందించే ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉంటాయి. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా పెంచుకుంటారు. ఈ ఆకులు అచ్చం వాము వాస‌న‌ను పోలి ఉంటాయి. వాము లాగే ఈ ఆకులు కూడా మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాము ఆకుల‌ను సాధారణంగా చాలా మంది బ‌జ్జీలుగా వేసుకుంటారు. దీంతో రోటి ప‌చ్చ‌డి చేసి తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే వాము ఆకుతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాము ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ ఒక్క వాము ఆకును తింటే చాలు ర‌క్త నాళాలు క్లీన్ అవుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. రోజూ ఒక వాము ఆకును న‌మిలి తింటే చాలు జీవితంలో అస‌లు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే హైబీపీ ఉన్న‌వారు ఈ ఆకును రోజూ ఒక‌టి తింటే చాలు బీపీ కంట్రోల్ అవుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఇలా వాము ఆకుతో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు.

Vamu Aaku

ఇక ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు సైతం క్లీన్ అవుతాయి. అల‌ర్జీలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆస్త‌మా ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. వాము ఆకుల్లో యాంటీ హిస్టామైన్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల రోజూ ఈ ఆకుల‌ను తింటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. ఇక ఈ ఆకుల‌ను కాస్త వేడి చేసి క‌ట్టులా క‌డితే ఎలాంటి నొప్పుల నుంచి అయినా స‌రే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వాము ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఆకులు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటున్నా చాలు ఈ నొప్పుల నుంచి ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు.

వాము ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ వాము ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా క‌డుపు నొప్పి, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ ఒక వాము ఆకును తింటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. వాము ఆకుల్లో యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఆకులను రోజూ తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. రోగాల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇలా వాము ఆకుల‌తో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కనుక రోజూ ఈ ఆకులను తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM