lifestyle

Beetroot For Liver : లివ‌ర్‌ను క్లీన్ చేసి పెట్టే అద్భుత‌మైన ప‌దార్థం ఇది.. అసలు మిస్ చేయ‌కండి..!

Beetroot For Liver : మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీర్ణ‌క్రియ‌, మెట‌బాలిజం, శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ స‌క్ర‌మంగా జ‌రిగేలా చూస్తుంది. అయితే మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్లు, జీవ‌న‌శైలి కారణంగా చాలా మంది లివ‌ర్ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపుగా 25 శాతం మంది ఏదో ఒక లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లివ‌ర్ సిర్రోసిస్‌, హెప‌టైటిస్‌, ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ లేదా నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వంటి లివ‌ర్ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. అయితే లివ‌ర్ వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఏదైనా లివ‌ర్ వ్యాధి బారిన ప‌డితే అప్పుడు లివ‌ర్ చేసే ప‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. దీంతో మన శ‌రీరం కొన్ని సంకేతాలు, ల‌క్ష‌ణాలను మ‌న‌కు చూపిస్తుంది. ముఖ్యంగా చ‌ర్మం ప‌సుపు రంగులోకి మార‌డం, చ‌ర్మం దుర‌ద‌లు పెట్ట‌డం, మూత్రం ముదురు రంగులో రావ‌డం, మ‌లం ప‌సుపు రంగులో కాకుండా ఇత‌ర రంగుల్లో రావ‌డం, పొట్ట ద‌గ్గ‌ర ఉబ్బిపోయి ఉండ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి అనేక ల‌క్ష‌ణాలు మ‌న‌కు లివ‌ర్ వ్యాధుల కార‌ణంగా క‌నిపిస్తాయి.

Beetroot For Liver

అయితే లివ‌ర్ వ్యాధులు వ‌చ్చిన‌వారు ఏమాత్రం ఆల‌స్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను కల‌వాలి. దీంతో వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. వారు ఇచ్చే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాల్సి ఉంటుంది. అలాగే రోజూ తీసుకునే ఆహారంలోనూ ప‌లు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా లివ‌ర్‌ను క్లీన్ చేసే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో నెల రోజుల్లోనే మార్పు క‌నిపిస్తుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

ఇక లివ‌ర్‌ను క్లీన్ చేసే ఆహారాల్లో బీట్‌రూట్ అతి ముఖ్య‌మైన‌ద‌ని చెప్పుకోవ‌చ్చు. ఇది లివ‌ర్‌ను క్లీన్ చేయ‌డ‌మే కాకుండా లివ‌ర్ ఆరోగ్యానికి అవ‌స‌రం అయిన ఎంజైమ్‌ల‌ను అందిస్తుంది. అలాగే లివ‌ర్ ప‌నితీరు మెరుగుప‌డేందుకు స‌హాయం చేస్తుంది. క‌నుక బీట్‌రూట్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఇది ర‌క్తాన్ని సైతం శుద్ధి చేస్తుంది. లివ‌ర్‌, ర‌క్తంలో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌టకు వెళ్లిపోతాయి. రోజూ బీట్‌రూట్ ముక్క‌ల‌ను ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు తింటే మంచిది. లేదా ప‌ర‌గ‌డుపునే బీట్‌రూట్ జ్యూస్‌ను అయినా తాగ‌వ‌చ్చు. దీన్ని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. అందులో నిమ్మ‌ర‌సం, అల్లం ర‌సం క‌లిపితే ఇంకా మంచిది.

ఇలా బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కుపోతాయి. ప‌లు ర‌కాల లివ‌ర్ వ్యాధుల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM