lifestyle

Stuffed Masala Vankaya : మ‌సాలా కూరిన వంకాయ‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Stuffed Masala Vankaya : కూర‌గాయాల‌న్నింటిలోనూ వంకాయ‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా స‌రే.. భోజ‌న ప్రియులు లొట్ట‌లేసుకుంటూ తింటారు. ఇక మ‌సాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంత‌లా ఆ కూర రుచిగా ఉంటుంది. మ‌రి మ‌సాలా కూరిన వంకాయ ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

మ‌సాలా కూరిన వంకాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు (పొడవుగా, లావుగా ఉన్న‌వి) – అర‌కిలో, వెన్న – 100 గ్రాములు, ఎండు మిర‌ప‌కాయ‌లు – 8, ధ‌నియాలు – 3 టీస్పూన్లు, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – 3 టేబుల్ స్పూన్లు, మిన‌ప‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – త‌గినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు.

Stuffed Masala Vankaya

మ‌సాలా కూరిన వంకాయ తయారు చేసే విధానం..

పాన్ తీసుకుని అందులో ఎండు మిర‌పకాయ‌లు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు విడివిడిగా వేయించుకోవాలి. త‌రువాత అన్నింటినీ క‌లిపి మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టుకోవాలి. కానీ పొడిని మ‌రీ మెత్త‌గా కాకుండా చూసుకోవాలి. అందులో ఉప్పు, వెన్న బాగా క‌లిపి ముద్ద‌లా చేసుకోవాలి. వంకాయ‌లు క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. ఒక్కో కాయ‌నీ కింది నుంచి నాలుగు భాగాలుగా కోసి కాండం వ‌ద్ద వ‌దిలేయాలి. అనంతరం కాయ‌లో వెన్న క‌లిపిన పొడిని కూరాలి. లోప‌లి నుంచి మ‌సాలా బ‌య‌ట‌కు రాకుండా కాయ‌ల‌ను దారంతో క‌ట్టాలి. అనంత‌రం పాన్ తీసుకుని నూనె వేసి కాయల‌న్నింటినీ ప‌క్క ప‌క్క‌నే పాన్‌లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు కాయ‌ల‌ను బాగా ఫ్రై చేయాలి. త‌రువాత కాయ‌ల‌ను రెండో వైపుకు తిప్పుకుని కూడా అలాగే వేయించుకోవాలి. దీంతో రుచికర‌మైన మ‌సాలా కూరిన వంకాయ రెడీ అవుతుంది. ఈ కాయ‌ల‌ను అన్నంలో లేదా చ‌పాతీలో అంచుకు తింటే బాగుంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM